YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కండకావరంతో మాట్లాడుతున్న పేర్ని నాని

కండకావరంతో మాట్లాడుతున్న పేర్ని నాని

మచిలీపట్నం
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే పేర్ని నానిపై మండిపడ్డారు. మచిలీపట్నంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ప్రజాగళం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజాగళం సభకు వచ్చిన జనప్రభంజనానికి పేర్ని నానికి మతిభ్రమించింది. పేర్ని నాని ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు. కిందా పైనా తెలియకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడని అన్నారు.
చంద్రబాబుని విమర్శించే స్థాయి పేర్ని నానికి లేదు. కొడుకును ప్రమోట్ చేసుకోవడమే తప్పా చేసిన తప్పులకు పశ్చాతాపం పడాలనే ఆలోచన పేర్ని నానికి లేదు. నీ బట్టలు ఊడదీసే చిట్టా రెండు రోజుల్లో రాబోతోందని అన్నారు.
పెయిడ్ ఉద్యమం అని ప్రజా ఉద్యమాన్ని ఎగతాళి చేయలేదా..!? "అమ్మ తోడు పెదపట్నంలోనే పోర్టు" అన్నది నున్వు కాదా..!? ఈ రోజు పోర్టు గురించే మాట్లాడే అర్హత నీకు ఉందా..!? 2014లో బందరుకు పోర్టు తీసుకురాకపోతే కోనేరుసెంటరులో ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తా అన్న మాటలు  ఏమైపోయాయని అన్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేం రైతులకు పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చి పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించాం. అప్పుడు కూడా రైతుల్ని రెచ్చగొట్టి పోర్టు నిర్మాణాన్ని అడ్డంకులు సృష్టించిన వ్యక్తి పేర్ని నాని. మీరొచ్చిన తర్వాత పోర్టు నిర్మాణానికి సహకరించామే గానీ ఏ రోజు కూడా నీలా రైతుల్ని రెచ్చగొట్టలేదు. పోర్టు శంకుస్థాపనకు మేం రూ.8కోట్లు ఖర్చు పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నావ్. దమ్ముంటే రా లెక్కలు తీద్దామని అన్నారు.
బందర్ కు మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత నువ్వేం చేశావ్.. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి తెచ్చావా..!? మెడికల్ కాలేజ్ భూముల కేటాయింపు 8 కోట్లు అవినీతి జరిగిందని కాగ్ చెప్పింది. దీనిపై ఎప్పుడైనా సమాధానం  చెప్పావా..!? బందరుకు కరోనాను  పరిచయం చేసింది నువ్వు, నీ కొడుకు కాదా..!? మీ కార్పొరేటర్, నీ కారు డ్రైవర్ మరణానికి కారణమైంది నువ్వు కాదా..? తిరుపతి బై ఎలక్షన్ ప్రచారానికి వెళ్లి వచ్చి బందరులో కరోనా వ్యాప్తికి కారకులైంది నువ్వు, నీ కొడుకు కాదా..!? నీ కొడుకు కరోనాలో పొడిచేశాడు అని చెబుతున్నావ్ కాదా. నీ కొడుకు కరోనాలో సర్వీస్ చేస్తే ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ లేక ఆరుగురు కరోనా పేషెంట్స్ ఎందుకు చనిపోయారు..!? బెడ్లు లేక వందల మంది ఎందుకు చనిపోయారు..!? కరోనా పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడిన చరిత్ర నీది, నీ కొడుకుది. నీ కొడుకు నువ్వు రెమిడైజ్ ఇంజక్షన్లు అమ్ముకున్నది వాస్తవం కాదా..? నీ కొడుకు ఫోటో ఫోజుల కోసం హాస్పిటల్ లో కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లి ఎంతో మందికి కరోనా అంటించింది వాస్తవం కాదా..? కరోనా సంయంలో నేను ఇంట్లో పొడుకున్నానా..!? నేను ఇంట్లో పొడుకుంటే నాపై  కరోనా కేసులు ఎందుకు పెట్టించావో చెప్పు..!? చిలకలపూడిలో రెడ్ జోన్లు పెట్టి ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు రానివ్వకుండా నిర్భందించావ్. కోవిడ్ తో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నేను వెళితే పోలీసులతో నన్ను అడ్డుకున్నావనిఅన్నారు.
కరోనా సమయంలో నువ్వు, నీ కొడుకు చేసింది షో తప్ప ఇంకేమిలేదు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించి వందల మంది చావుకు కారకులయ్యారు. బందరును ఒక గంజాయి కేంద్రంగా మార్చారు. మచిలీపట్నంలో అడుగడుగున జరుగుతున్న  దాడులకు మీరు పెంచిపోషించిన గంజాయి బ్యాచ్ కాదా..!? పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది  వాస్తవం కాదా..!? జనసేన నేతకు చెందిన బార్ పై దాడి చేసింది వాస్తవం కాదా..!? పోతేపల్లిలో యశ్వంత్ అనే యువకుడిపై దాడి చేసింది వాస్తవం కాదా..!? ఓ పెళ్లిలో తోట యశ్వంత్ అనే జనసేన కార్యకర్త భోజనం చేస్తుంటే దాడి చేసింది వాస్తవం కాదా..!? మొన్నటికి మొన్న ఉల్లిపాలెంలో ఇద్దరు అన్నదమ్ములపై దాడి చేసింది మీరు పెంచిపోషించిన గంజాయి బ్యాచ్ కాదా..!? ఈ ఐదేళ్లలో నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టావ్..!?  చేయని నేరానికి 54 రోజులు నన్ను జైలు పెట్టించలేదా..!? నీ అరాచకాలకు, బెదిరింపులకు మేం ఎవ్వరం భయపడం. పేర్ని నాని అరాచకాల నుండి బందరును కాపాడుకుంటాం. రేపు అధికారంలోకి వచ్చేది మేమే. పోర్టు నిర్మాణం, అగిపోయిన అభివృద్ధిని పూర్తి చేసిది కూడా మేమేనని అన్నారు.

Related Posts