YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరంగల్ లో మళ్లీ డైలాగ్ వార్ రాజయ్య వర్సెస్ శ్రీహరి

వరంగల్ లో మళ్లీ  డైలాగ్ వార్ రాజయ్య వర్సెస్ శ్రీహరి

వరంగల్, ఏప్రిల్ 20
చిరకాల రాజకీయ ప్రత్యర్థుల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. రెండు దశాబ్దాలకు పైగా ఓకే నియోజకవర్గంలో శత్రువులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారే ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. పార్లమెంటు ఎన్నికల వేల ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య లు విమర్శల దాడి మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచార వేదికలపై ఒకరిపై ఒకరు మాటల దాడులకు దిగుతున్నారు. కబడ్డీ ఆడుతా అని రాజయ్య అంటే... దళిత బంధులో అవినీతి పరుడివి నీ అంతూ చూస్తానంటూ కడియం అంటున్నారు.కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య లు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇద్దరి నేతలు స్టేషన్ ఘన్ పూర్ నుండే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కడియం శ్రీహరి టిడిపి నుండి ప్రారంభించగా. తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుండి తన రాజకీయాన్ని ప్రారంభించారు. ఇద్దరిది ఒకటే నియోజకవర్గం కావడంతో రాజకీయ ప్రత్యర్థులుగా మారుతూ వచ్చారు. అయితే ఇద్దరు 2010 వరకు వేరు వేరు పార్టీల్లో ఉన్న శ్రీహరి, రాజయ్య లు రాజకీయ విమర్శల వరకే పరిమితమయ్యారు.కడియం శ్రీహరి చేతిలో పరాజయం పాలవుతూ వచ్చిన తాటికొండ రాజయ్య మొట్టమొదటిసారిగా 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్టేషన్ ఘన్పూర్ నుండి విజయం సాధించారు. 2011లో తెలంగాణ ఉద్యమం, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజయ్య  కాంగ్రెస్ ను వీడి టీ ఆర్ ఎస్ లో చేరారు. కొద్ది రోజులకే తెలంగాణ లో టీడిపి తుడిచి పెట్టుకుపోవడంతో కడియం శ్రీహరి సైతం అప్పటి టీ అర్ ఎస్ లో చేరారు. దీంతో ఇద్దరు ప్రత్యర్థులు ఒకే పార్టీ నేతలు అయ్యారు.తాటికొండ రాజయ్య 2009, 2012 ఉపఎన్నిక, 2014 2018 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో రాజయ్య తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఏడాది లోగా రాజయ్యను పదవి నుండి తప్పించి కడియం ను ఉపముఖ్యమంత్రి చేయడంతో అప్పటి నుండి ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైంది. నివురు గప్పిన నిప్పులా కోపం ఉన్న అధినేత కేసీఆర్ భయంతో విమర్శలు చేసుకోకపోయిన ఎడముఖం... పెడముఖం లా ఉంటూ వచ్చారు ఇద్దరు నేతలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అధినేత తాటికొండ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి స్టేషన్గన్పూర్ టికెట్ కేటాయించారు దీంతో ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైంది ఉపముఖ్యమంత్రి పోవడానికి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరి కారణమని రాజయ్య మాటల దాడి చేశారు నా దాడి కాస్త వ్యక్తిగత విమర్శలు వరకు వెళ్లి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని కేసీఆర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చి రాజయ్య కు ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చారు. బీ అర్ ఎస్ అధికారాన్ని కోల్పోవడం, ఎంపీ టిక్కెట్ రాదని భావించిన రాజయ్య రెండు నెలల క్రితం బీ ఆర్ ఎస్ ను వీడారు. కొద్దిరోజుల క్రితం కడియం శ్రీహరి సైతం బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కే సీ ఆర్ రాజయ్య ను పార్టీ లోకి ఆహ్వానించడం తిరిగి పార్టీలో చేరి నియోజకవర్గానికి వచ్చిన రాజయ్య ప్రత్యర్ధి కడియం పై విమర్శలు మొదలు పెట్టారు. బ్లాక్ మెయిల్, వెన్నుపోటు రాజకీయాల్లో కడియం శ్రీహరి దిట్ట అని రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్, కేసీఆర్ లకు మోసం చేశారని రాజయ్య విమర్శించారు. నిన్నటికి నిన్న కబడ్డీ ఆడిస్తానని డైపర్లు వేసుకోవాలని రాజయ్య కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి సైతం దళిత బందు అక్రమార్కుడని ఇక చూసుకుందామని కడియం శ్రీహరి సైతం ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎన్నికలవేళ కడియం తాటికొండల మాటల దాడి తారాస్థాయికి చేరనుంది.

Related Posts