YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తొడగొడుతున్న రాజయ్య

తొడగొడుతున్న రాజయ్య

వరంగల్, ఏప్రిల్ 20
ఓరుగల్లులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. అవి పక్కదేశం పాకిస్థాన్ వైపు దూసుకెళ్తున్నాయి. స్టేషన్ ఘన్‎పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి శివమెత్తారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య కడియం శ్రీహరిని భూస్థాపితం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. ఒకవైపు మాటల తూటాలు మరోవైపు తనదైన శైలిలో స్టెప్పులేసి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈల కొట్టి స్టెప్పులేసిన రాజయ్య కెసిఆర్ పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి, బిఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. రాజయ్యతో పాటు, అక్కడే ఉన్న నేతలు సైతం స్టెప్పులు వేశారు. బీఆర్ఎస్ పార్టీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‎లో ఉన్న తాటికొండ రాజయ్య ఇప్పుడు ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్‎గా మారారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కడియం శ్రీహరిపై రాజయ్య రంకెలేస్తున్నారు. తొడగొట్టి సవాల్ విసిరిన రాజయ్య.. నమ్మకద్రోహం చేసిన కడియం శ్రీహరిపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.

Related Posts