YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మర్రిచెట్టు తొర్రలో 66 లక్షలు

మర్రిచెట్టు తొర్రలో  66 లక్షలు

ఒంగోలు, ఏప్రిల్ 22 
మర్రిచెట్టు తొర్రలో రూ.66 లక్షల నగదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఓ ఏటీఎం వ్యానులో నగదు చోరీ చేసిన దొంగలు ఎక్కడ దాచాలో తెలియక చెట్టు తొర్రలో సొమ్ము దాచారు. నిందితులను గుర్తించిన పోలీసులు నగదు రికవరీ చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న ఒంగోలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర చోరీ జరిగింది. ఒంగోలు-కర్నూలు రోడ్డులోని ఓ పెట్రోల్‌ బంకు ఆవరణలో ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్‌ ఏజెన్సీకి చెందిన వ్యాను వచ్చింది. ఈ వ్యానులో రూ.68 లక్షల నగదు ఉంది. మధ్యాహ్నం సమయం కావడంతో నగదు ఉన్న వ్యాను పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో నిలిపి ఏటియం సెంటర్‌ వెనుక వైపు భోజనం చేసేందుకు వెళ్లారు. సిబ్బంది తిరిగి వచ్చే సరికే వ్యానులో నగదు మాయం అయింది. సినీ ఫక్కీ జరిగిన ఈ చోరీ ఘటనపై సీఎంఎస్‌ ఏజెన్సీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ వాహనం నుంచి సుమారు రూ. 66 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు సీఎంఎస్ సంస్థ లోకల్‌ మేనేజర్‌ కొండారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు లక్షలను అక్కడే వదిలేశాడు. లంచ్ చేసి వచ్చిన సిబ్బంది వ్యాను డోర్‌ తీసి ఉండడంతో వెంటనే నగదు కోసం చూశారు. క్యాష్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల దర్యాప్తులో సీఎంఎస్ ఉద్యోగులే నిందితులని తేలిపింది. దొంగిలించిన డబ్బు మొత్తాన్ని నిందితులు ఓ మర్రి చెట్టు తొర్రలో దాచి పెట్టడం ఇక్కడ విశేషం. ఒంగోలు సీఎంఎస్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ కొండారెడ్డి, సీఎంఎస్‌ మాజీ ఉద్యోగి మహేష్‌బాబ, రాచర్ల రాజశేఖర్‌ చోరీ చేసినట్లు గుర్తించారు. టెక్నికల్ ఆధారాలతో ముందు మహేష్ బాబును పట్టుకున్నామన్నారు. అతడిని విచారించగా... అసలు విషయం తెలిసిందన్నారు. చోరీ చేసిన నగదును మర్రి చెట్టు తొర్రలో దాచారని, డబ్బు రికవరీ ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ అనీల్ తెలిపారు. లింగారెడ్డి కాలనీలోని సీఎంఎస్‌ కార్యాలయం వద్ద రాజశేఖర్‌, కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పనిచేస్తున్న కంపెనీకే కన్నం వేయాలని ప్రయత్నించి నిందితులు దొరికిపోయారు.

Related Posts