YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దేశాన్ని ప్రపంచంలో నిలబెట్టాడమే ప్రధాని మోడీ లక్ష్యం

దేశాన్ని ప్రపంచంలో నిలబెట్టాడమే ప్రధాని మోడీ లక్ష్యం

రంగారెడ్డి
దేశాన్ని ప్రపంచంలో నిలబెట్టాడమే ప్రధాని మోడీ లక్ష్యం అని చేవెళ్ల పార్లమెంటు బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి  అన్నారు. ఆయన కేంద్రమంత్రి పియుష్ గోయల్ కలిసి రాజేంద్రనగర్ లోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో మరో మారు కేంద్రంలో బిజెపి సర్కారు ఏర్పడుతుందన్నారు.  నాలుగు వందల స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్మన్నారు. మోడీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు.  ప్రధాని మోదీ పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు.  అనంతరం మీడియా పాయింట్ వద్ద కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక సిద్ధాంతమ అన్నారు.  బిజెపి ఒకే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని తెలిపారు.  వచ్చేఎన్నికల్లో మూడు లక్షల మెజారిటీతో విజయంసాధిస్తాననిపేర్కొన్నారు. ప్రధాని  యుగపురుషుడని తెలిపారు.  అంతకుముందు విశ్వేశ్వర్ రెడ్డి తన సతీమణి సంగీతారెడ్డి తో కలిసిబండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాళీ మందిర్లోప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో గ్రామాల్లోకనీసంటాయిలెట్స్ కూడా ఉండేవి కావని,మోడీ ప్రధాని అయిన తర్వాత ఆ పరిస్థితిపూర్తిగా మారిపోయింది అన్నారు.  అనివృత్తులకు చేయూత అందించేందుకు ముద్ర లోన్స్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారంటీలతో ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు.  మాఫీచేసేందుకు 35 వేల కోట్లు అవ్వాలని చెబుతున్న సర్కారు నిధుల సమీకరణ చేస్తుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో బిజెపి నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

Related Posts