YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యువత చరిత్ర తెలుసుకోవాలి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

యువత చరిత్ర తెలుసుకోవాలి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్
సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అందుకే కేసీఆర్, ఆయన కుటుంబం ఎదిగింది. ఇందిరా గాంధీ కుటుంభం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇందిరా గాంధీ చిన్న వయస్సు లోనే స్వాతంత్ర్య పోరాటం లో 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది. దేశం కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర నరేంద్ర మోడీ, కేసీఆర్ కు ఉందా? కేసీఆర్ ఒక్క రోజుకే గిల గిల కొట్టుకుండు. కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి ఏమి చేసిందని బీజేపీ నేతలు, బీఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇందిరా గాంధీ 16సంవత్సరాలు ప్రధానిగా ఉండి దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో ని దళితులకు ప్రభుత్వ భూములను పంచి పెట్టిందని అన్నారు.
అప్పుడు బ్యాంక్ లు ధనికులు మాత్రమే అందుబాటులో ఉన్నవి. ఇందిరా గాంధీ పేదలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ లను జాతీయం చేసింది, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట,నివసించడానికి ఇల్లు నినాదంతో ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది. ఇందిరా గాంధీ బీహెచ్ఈఎల్ ,ఐడిపిల్, హెచ్ఏఎల్, హెచ్ఎమ్ టి, బిడిఎల్, హెచ్ సిఎల్, డిఆర్డీఎల్,సీఎస్ ఐఆర్,మీదాని,ప్రాగా లాంటి జాతీయ సంస్థలను స్థాపించింది. యువకులు భజరంగ్ దళ్ పాటలకు స్టెప్పులేయడం కాదు చరిత్ర గురించి  తెలుసుకోవాలని అన్నారు.

Related Posts