YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేషన్ కార్డులు

పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేషన్ కార్డులు

హైదరాబాద్, ఏప్రిల్  25
తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం సుమారుగా 20 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు జారీ కాలేదు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అధికారం లోకి వచ్చాక రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మూడు నెలల క్రితం ప్రకటించింది. తాజాగా ప్రజానీకానికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది.తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఆరు గ్యారంటీల అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రేషన్‌ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందులో 19 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. తాజాగా వాటి పరిశీలనపై దృష్టిపెట్టింది. దరఖాస్తు చేసుకోనివారు ఉంటే రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులందరికీ రేషన్‌ కార్డు ఇస్తామని చెబుతోంది.ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక సమాచారం వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని తెలిపారు. కోడ్‌ ముగిసిన వెంటనే అధికారులను దరఖాస్తుదారుల ఇంటికి పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని పేర్కొన్నారు.ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్‌ కార్డుల జారీ కార్యక్రమం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్‌ రెండో వారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించి జూలైలో కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు రేషన్‌కార్డు అందితే.. పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది

Related Posts