YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విద్యుత్ కోతలున్నాయి.. రైతు బంధు లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

విద్యుత్ కోతలున్నాయి..  రైతు బంధు లేదు..   బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థితో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేల మీడియా సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రుణ మాఫీ చేయకపోవటం పై ప్రశ్నిస్తే., బెదిరించేలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్య పెడుతున్నాడు. కేసీఆర్ హయంలో విద్యుత్ కోతలు అనేవి లేవు.  నేడు కాంగ్రెస్ హయంలో విద్యుత్ కోతలు, రైతు బంధు సైతం సరిగ్గా అందటం లేదు.  రేపు రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలి.
ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ  ఎల్బీ నగర్ లో మెట్రో ట్రైన్ ఎక్కి కూకట్పల్లి వరకు ప్రయాణం చేశాము.  గత పది సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ లు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాలలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు.  ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రయాణ సౌలభ్యం కోసం మెట్రో రైలును తీసుకొని వచ్చారు. చెరువులో ఉండే చేపలు మాయం అయ్యాయి.. చెరువులు ఎండిపోయాయి.  కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు వచ్చింది.  4వేల రూపాయల పింఛను అని ఆశ చూపెట్టి ఉన్న 2 వేలు కూడా పోగొట్టారు.  కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ప్రజలకు తాగు నీటి సమస్య మొదలయ్యింది. # ముఖ్యమంత్రికి, మంత్రులకు అడ్మినిస్ట్రేషన్ రావటం లేదు.  పాలన చేయకుండా తిట్లతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయ్యింది.  కరోనా సమయంలో సైతం ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.  కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ అభ్యర్థులను ఇంపోర్ట్ చేసుకున్నారు.  రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు.  రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి కేసీఆర్ కు మల్కాజ్ గిరి సీటును బహుమతిగా ఇస్తామని అన్నారు.
రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తీసుకొని వచ్చి 10 సంవత్సరాల పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాల ఉన్నతికి కృషి చేశారు.
రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోయాక ... మల్కాజ్ గిరి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి యంపి గా గెలిచి, మోసం చేసి ఏ ఒక్క రోజు కూడా పార్లమెంటులో మాట్లాడింది లేదు.
యంపి అయ్యాక పీసీసీ అధ్యక్షుడై అబద్ధాలు చెప్పి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు.
కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూడు నెలలో ఇప్పుడు యంపి ఉద్యోగం కోసం మహేందర్ రెడ్డి పార్టీ మారారు. బిజెపి అభ్యర్థి చెల్లని రూపాయి.  సొంత నియోకవర్గంలో గెలవలేని వ్యక్తి ఇక్కడ యంపి గా పోటీ చేస్తున్నారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ లో మా యంపి కనపడటం లేదని గతంలో పోలీస్ స్టేషన్లలో ప్రజలు ఫిర్యాదు చేశారు. రానున్న ఎన్నికల్లో స్థానిక వ్యక్తినైనా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ తన తండ్రి, సోదరి మరణాల తరువాత తనకు ఎన్నికల్లో పోటీ చేయటానికి కేసీఆర్ అవకాశం కల్పించారు. # కేసీఆర్ హయంలో అభివృద్ధి ఎంతో జరిగింది.  తన తండ్రి సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎంతగానో  కృషి చేశారు.  తన తండ్రిని, సోదరిని ఏ విధంగా ఆదరించారో, తనని సైతం ఆదరించి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ...

Related Posts