YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉపాధిహామీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్

ఉపాధిహామీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్

జగిత్యాల,
గ్రామాల్లో కూలీలు, వ్యవసాయ కూలీలకు వంద రోజులు ఉపాధి కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకం తీసుకువచ్చి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించిందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పిటిసి తాటిపర్తి శోభారాణి అన్నారు.
గురువారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో ఉపాధిహామీ పథకం కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి శోభారాణివారితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,500 లకే సిలిండర్ అందించిందని తెలిపారు.
,పింఛన్ రాని మహిళలకు నెలకు 2500 రూపాయలు అందించనుందని, అలాగే ఇల్లు లేనివారికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు.
దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం బీజేపీకి సరికాదన్నారు.
గత పదేళ్లు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలించి ప్రజలకు చేసిందేమిలేదని, కార్పొరేట్ సంస్థలను పెంచిపోషించారని శోభారాణి విమర్శించారు.
కేసీఆర్ తన కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెట్టాడు కానీ పేదలకు ఒరగబెట్టింది శూన్యమని పేర్కొన్నారు.
బీజేపీ, బారాస పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని, ప్రజనాయకుడికి పట్టం కట్టలన్నారు.
నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టాల్లో పలుపంచుకునే జీవన్ రెడ్డి ని నిజామాబాద్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి, సంక్షేమం, రైతు, యువత, నిరుద్యోగులు, మహిళలు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జీవన్ రెడ్డి ని మే13 న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటువేసి ఎంపీగా అవకాశం కల్పించాలని శోభారాణి కోరారు.

Related Posts