YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోటీశ్వరులే కాదు సామాన్యులు...

కోటీశ్వరులే కాదు సామాన్యులు...

విజయవాడ, ఏప్రిల్ 27 
ఎన్నికలంటే కోట్ల రూపాయల ఖర్చు... అసలు సామాన్యులెవ్వరూ ఆ వైపు ఆలోచించనుకూడా లేరు... సాధారణంగా అందరికీ కలిగే అభిప్రాయం ఇది. ప్రస్తుత ఎన్నికల్లో కొందరి ఆస్తుల వివరాలు చూస్తే ఆ విషయం నిజమే అనే భావన కలుగుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఆర్ధికంగా బలవంతులకే టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే కొందరు సామాన్యులూ ఈ సార్వత్రిక సమరానకి సై అంటున్నారు. కొంత ఆశ్చర్యంగా ఉన్నా .. ఇది నిజం. వారు సమర్పించిన అఫిడవిట్లు అందుకు సాక్ష్యం.కోట్లల్లో స్థిరాస్తులు, అంతకు మించి చరాస్తులు... ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధుల అర్హతగా మారిపోయింది. కానీ బ్యాంకు ఖాతాలో కనీసం నాలుగంకెల బ్యాలెన్స్ కూడా లేని వ్యక్తులు కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇలాంటి వారిలో అధికార వైసీపీ తరపున పోటీలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో మొదటి లైన్ లో సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈర్లకప్ప ఉన్నారు. ఈయనకు సొంత బైకు తప్ప ఎటువంటి స్థిర చర ఆస్తులు లేవు. కేవలం 2,783 రూపాయలు మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్ సమర్పించారు. ఆయన బ్యాంకు బ్యాలెన్సులు మరీ చిత్రం. ప్రగతి గ్రామీణ బ్యాంకులో 11 రూపాయలు,  కెనరా బ్యాంకులో 41 రూపాయలు, ఏడీసీసీ బ్యాంకులో రూ. 26,950 రూపాయలు, యూనియన్ బ్యాంకులో రూ. 881 లు ఉన్నాయి. ఆస్తులు లేకున్నా అప్పులు దండిగానే ఉన్నాయి . రూ.1,13,050 అప్పులు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో బ్యాంకు లోను రూ. 86,100, ఇతర అప్పులు రూ. 26,950. మొత్తంగా స్థిర చర ఆస్తులు కలిపి రూ. 99,883 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు ఈర్లక్కప్ప. మడకశిర టీడీపీ అభ్యర్ధిగా ఎమ్మెస్ రాజు పోటీ చేస్తున్నారు.ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజక వర్గం వైసీపీ అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు కూడా సామాన్యుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం మైలవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుపతిరావు మొత్తం ఆస్తి 4,20,766 రూపాయలు మాత్రమే. ఆయన అఫిడవిట్ ఈ విషయాన్ని క్లియర్ గా చెపుతోంది. చరాస్తులు కూడా రూ.1,89,642 మాత్రమే. బ్యాంక్ అకౌంట్ లో తొమ్మిది వేల రూపాయలు, తనకు ఒక బైక్ మాత్రమే ఉంది. తనకు సంబంధించి బంగారం రూ. 1,65,000, చేతిలో నగదు రూ.15,000 ఉన్నట్లు అఫిడవిట్ లో చూపారు. ఈ అతి సామాన్యుడు తలపడుతోంది ఎవరితోనో తెలుసా అపర కుబేరుడు టీడీపీ క్యాండిడేట్ వసంత కృష్ణ ప్రసాద్‌ తో. ఇదే అసలు ఇంటరెస్టింగ్ టాపిక్. అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎం వీరాంజనేయులు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తే.  ప్రస్తుతం ఆయన సమర్పించిన అఫిడవీట్ ప్రకారం స్థిరాచరాస్తులకు సంబంధించి కేవలం 1,06,478 రూపాయలు మాత్రమే ఉన్నాయి. చేతిలో 50 వేల రూపాయలతో పాటు ఎస్‌బీఐలో 11,193 రూపాయలు, అలాగే ద్విచక్ర వాహనం మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ఆయన ఈ సార్వత్రిక ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఎం విశ్వేశ్వర రాజు అదే జాబితాలో ఉన్నారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిలో 20,39,512 రూపాయలు మాత్రమే ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల పేరు మీద రూ. 7,25,927లు విలువైన ఆస్తులు ఉన్నాయి. మొత్తం స్థిరాచరాస్తులు కలిపి రూ. 50,98,000 మాత్రమే ఉన్నట్లు, అప్పులు రూ.1,20,000 ఉన్నాయని ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Related Posts