YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ కు మద్దతుగా మెగా ఫ్యాన్స్....

పవన్ కు మద్దతుగా మెగా ఫ్యాన్స్....

హైదరాబాద్, ఏప్రిల్  27,
పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తారా? పిఠాపురం వస్తారా? అందులో నిజం ఎంత? అదంతా ఉత్త ప్రచారమేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈసారి చట్టసభల్లో అడుగు పెట్టాలని బలంగా డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని గుణపాఠంగా తీసుకున్నారు. పిఠాపురం నుంచి లక్ష కోట్ల మెజారిటీతో గెలవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆ మూడు పార్టీలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. అటు సర్వేలు సైతం పవన్ కళ్యాణ్ 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నాయి. అయితే ఎలాగైనా లక్ష ఓట్ల మెజారిటీ దాటాలని.. అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని జన సైనికులు భావిస్తున్నారు.ఇప్పటికే జనసేన స్టార్ క్యాంపెయినర్లు పిఠాపురంలో రంగంలోకి దిగారు. బుల్లితెర నటులతో పాటు జబర్దస్త్ కళాకారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. మెగా కాంపౌండ్ వాల్ నుంచి చాలామంది హీరోలు ప్రచారానికి వస్తారనిఒక వార్త హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ రాబోతున్నారని తెలుస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో వరుణ్ తేజ్ కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. బాబాయ్ అంటే తమకు ఇష్టమని.. ఆయనకు మద్దతుగా నిలుస్తామని.. ఆయన పిలిస్తే తప్పకుండా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని కూడా వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. అందుకే వరుణ్ తేజ్ ఈసారి ప్రచారంలో కీలకంగా కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాయిధరమ్ తేజ్ తో పాటు వైష్ణవి తేజ్ కూడా వస్తారని సమాచారం.అయితే పిఠాపురంలో చిరంజీవి అడుగుపెట్టబోతున్నారన్న ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. ఇటీవల కూటమి అభ్యర్థులను గెలిపించాలని చిరంజీవి వీడియో సందేశం పై వైసీపీ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అందుకే రాజకీయ ప్రచారాలకు వీలైనంత దూరంగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు వెళ్లాయని.. ఇప్పుడు చిరంజీవి కొత్తగా ప్రచారం చేసినా ఏం జరగదని.. ఇప్పటికే కూటమికి మెగా అభిమానులు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా అని తేలింది. ఈ సమయంలో అనవసరంగా చిరంజీవి రంగంలోకి దిగితే.. ఆయన కెరీర్ ను డామేజ్ చేసే విధంగా ప్రత్యర్థులు కుట్రలు చేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే చిరు తన మద్దతును పరోక్షంగానే తెలుపుతారని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే మెగా కాంపౌండ్ వాల్ నుంచి ముగ్గురు హీరోలు మాత్రం తప్పకుండా ప్రచారానికి వెళ్తారని టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts