YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు

భద్రాద్రి కొత్తగూడెం
దమ్మపేట మండలం వడ్లగూడెం దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం విజయం కాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో  సమావేశంలో మంత్రులు ఎంపీ అభ్యర్థి పాల్గొన్నారు. కాళేశ్వరం, ధరణి లొసుగులు, ప్రశ్నా పత్రాల లీకేజి సహా ఎన్నో అక్రమాలు BRS హయాంలో జరిగాయని రామసహాయం అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచక పాలన నచ్చకే రాష్ట్ర ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని,కేసీఆర్ కి  ముఖ్యమంత్రి గా వున్నప్పుడు రైతు కష్టాలు కనపడలేదని ఇప్పుడు మాత్రం రైతుల కష్టాలు కనిపిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దోచుకున్న కోట్లు దాచుకోవడానికే దొంగ దీక్షలు,దొంగ పర్యటనలు చేస్తున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ ని మోడల్ గా నిలబెడతామని మంత్రి పొంగులేటి అన్నారు.
రామసహాయం రఘురామరెడ్డి సుదీర్ఘ రాజకీయ నేపద్యమున్న వ్యక్తి అని, కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ అని, మొది సాక్షాత్తు రాముణ్ణే బ్యాలెట్ బాక్స్ దగ్గరకి తెచ్చారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.కేసీఆర్ ఓడిపోయి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ చవకబారు మాటలు మాట్లాడవద్దని, మాజీ ముఖ్యమంత్రిగా హోదా కాపాడుకోవాలన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి రామసహాయం రఘురామరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

Related Posts