YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గంజాయి, కల్తీకల్లును సమూలంగా నిర్మూలిద్దాము

గంజాయి, కల్తీకల్లును సమూలంగా నిర్మూలిద్దాము

నిర్మల్
గంజాయి, కల్తీకల్లును సమూలంగా నిర్మూలిద్దామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ కాలనీలో నిర్వహించిన పోలీసు కమ్యూనిటీ అండ్ కాంట్రాక్టు ప్రోగ్రాంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనను కలిగి ఉండాలన్నారు. వైఎస్ఆర్ కాలనీలో అధికంగా యువత గంజాయిని సేవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దీనీ వల్ల కాలనీకే చెడ్డపేరు వస్తుందన్నారు. దీన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ, నిబంధనలలో పాటించాలన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతున్న పలువురిని సన్మానించారు. అనంతరం కాలనీలో గంజాయి, కల్తీకల్లును నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేసి వాటిని అతికించారు. సరైన ధ్రువపత్రాలు లేని 97 ద్విచక్ర వాహనాలు,27 ఆటోలు, ఒక కారు, మూడు వేల రూపాయల విలువ గల మద్యంను స్వాధీన పరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి గంగారెడ్డి తో పాటు సిఐ రూరల్ సీఐ శ్రీనివాస్ పలువురు ఎస్సైలు పోలీసు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Related Posts