YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవరత్నాల ప్లస్ పేరుతో సిద్దం

నవరత్నాల ప్లస్ పేరుతో  సిద్దం

విజయవాడ, ఏప్రిల్ 27
2019లో ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఈసారీ 2024 ఎన్నికల్లో సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామని ఇప్పుడు మరింతగా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో విడుదల చేసినట్టు జగన్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చాలా వాటిని వైసీపీ కొనసాగించింది. వాటిని అప్‌డేట్‌ చేసింది. గతంలో ఇచ్చిన దాని కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఎక్కువ పేరు తీసుకొచ్చిన వాటిపై ఎక్కువ ఫోకస్ చేసిన వైసీపీ... వాటిని పెంచేందుకు మొగ్గు చూపించింది. సంక్షేమంపైనే ఎక్కువ ఫోకస్ చేసిన వైసీపీ... ఈసారి అదే మంత్రాన్ని నమ్ముకుంది. అయితే గత ఐదేళ్లలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చామని చెబుతున్నప్పటికీ కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్న విషయాన్ని గుర్తించింది. ముఖ్యంగా యువత, మహిళల కోసం ప్రత్యేక హామీలతో మేనిఫెస్టో రూపొందించారు.
వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో 2024లోని ముఖ్యమైన పథకాలు ఇవే
రెండు విడతల్లో పింఛన్లు 3500లకు పెంచుతామన్న జగన్‌... అయితే అది ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. ఆఖరి రెండేళ్ల తర్వాత పింఛన్లు పెంచుతామన్నారు.
వైఎస్‌ఆర్ చేయూత కింద లక్ష యాభైవేల రూపాయలు
వైఎస్‌ఆర్ కాపు నేస్తం- రూ. 1.20,000
వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం- రూ. 1,05000
జగనన్న అమ్మఒడి - 17,000
వైఎస్‌ఆర్‌ ఆసరా కింద 3,00,000 వరకు సున్నా వడ్డీ రుణాలు
రైతుభరోసా 13500 నుంచి 16000కు పెంపు (పంట వేసే సమయంలో 8000, మధ్యలో 4000 కటింగ్ సమయంలో 4000 ఇస్తామన్నారు. )
మత్య్సకారు భరోసా- లక్ష రూపాయల వరకు పెంపు
వాహన మిత్ర - లక్ష వరకు పెంపు
లారీ, టిప్పర్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వర్తింపు
డ్రైవర్లకు అర్థరూపాయికే వాహన రుణాలు ఇప్పిస్తాం
డ్రైవర్లు ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల బీమా కల్పిస్తాం
ప్రతి నియోజకవర్గం స్కిల్‌ హబ్‌ ఏర్పాటు
తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు
అబ్బాయిలకు2500, అమ్మాయిలకు 3000 వరకు స్కిల్‌ కాలేజీల్లో, యూనివర్శిటీల్లో చదువుకున్న వాళ్లకు స్టైపెండ్  
మొత్తం జనాభాలో 50 శాతం దళితులు ఉండి 500పైగా ఆవాసాలు ఉంటే ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు
ప్రార్థనా మందిరాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు
తోపుడు బండ్ల వాళ్లకు ఇచ్చే డబ్బులను 15 వేల నుంచి 20 వరకు పెంపు
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తీసుకునే బ్యాంకు రుణాలు వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది.
25 వేల జీతం తీసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు నవరత్నాలు వర్తింపు
జీవన బీమాను  డెలివరీబాయ్స్‌కు వర్తింపు  
ఐదేళ్లలో సురక్షిత తాగునీటిపై ప్రత్యేక దృష్టి

Related Posts