YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విజయాలు, అపజయాలు సమానమే

విజయాలు, అపజయాలు సమానమే

హైదరాబాద్, ఏప్రిల్ 27
విజయాలకు పొంగిపోయి అపజయాలకు కుంగిపోయే పార్టీ బీఆర్‌ఎస్‌ కాదని... ప్రజల కోసం ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జెండా ఎగరేశారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌గా ప్రయాణం ప్రారంభించి బీఆర్‌ఎస్‌గా రూపొంతరం చెందిన పార్టీ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు కేటీఆర్. శూన్యం నుంచి 2001లో తెలంగణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రారంభించారని అప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని స్వరాష్ట్రం సాధించడమే కాదు... రెండుసార్లు అధికారాన్ని కూడా పొందారని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... "2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆరోజు ఉన్న పరిస్థితుల్లో అనేక ప్రతికూలతలు ఉన్న తెలంగాణ కోసం పార్టీని ఏర్పాటు చేశాం.కెసిఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్‌. "తెలంగాణ ప్రజల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం సహకారమైంది. మా పార్టీ తరఫున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. ఆనాడు ఎన్ని రకాల కుట్రలు చేసినా సమైక్యవాద శక్తుల కుట్రలు ఛేదించి... తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టిఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్‌దే అని 2014లో మా పార్టీకి అవకాశం ఇచ్చారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశాం" అన్నారు. తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు కేటీఆర్. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు. "దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదు. అయితే కెసిఆర్ తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాల్లో ప్రజలందరూ చూశారు. బోధించు, సమీకరించి, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. అని వివరించారు.తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరికీ మాకు అందరికీ మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము ఇదే తీరుగా మా ప్రస్థానం సాగింది. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం" అన్నారు కేటీఆర్తెలంగాణకంటూ ఒక గొంతు ఉండడం అవసరం... తెలంగాణ కంటు ఉన్న ఒక ఇంటి పార్టీ టిఆర్ఎస్... తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయని పేర్కొన్నారు కేటీఆర్.  తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు ప్రాణాలు అర్పించి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాది తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటాం. కెసిఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుదాం " అని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Related Posts