YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజేందర్ రావును గెలిపించండి జగిత్యాల జిల్లా

రాజేందర్ రావును గెలిపించండి జగిత్యాల జిల్లా

వేములవాడ
వేములవాడ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, , ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, , కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలి చాల రాజేందర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గోన్నారు.
మంత్రి మాట్లాడుతూ మీరు డబుల్ బెడ్రూం ఇచ్చిన ఊర్లలో ఓట్లు అడగం.. మేము ఇందిరమ్మ ఇల్లు  ఇచ్చిన ఊర్లలోకి మీరు రావద్దు. ఉద్యోగాల్ ఇస్తామని మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ 50 ఎల్ల నుండి పాలిస్తుంది. .. అప్పుడు శ్రీరామ నవమి జరగలేదా...? హనుమాన్ చాలిసా చదవలేదా...? ఒక ప్రధాని స్తాయి వ్యక్తి ఆయనేమో ఆధాని , అంబానీలకు దోచిపెట్టాడు. కాంగ్రెస్ అధికారంలోకి సంబంధ ముస్లింలకు పంచుతారని అంటున్నాడు. 50 ఏళ్లలో ఎప్పుడైనా చేశామా. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో ఉన్నా హిందువులకు ఎం చేసిందొ చెప్పాలి. శ్రీరాముడి కళ్యాణం తరువాత అక్షింతలు వస్తాయి.. కాని అయోధ్య లో గుడి ప్రారంభం కూడా కాలేదు ఊర్లలో పసుపు బియ్యం కలిపి అక్షింతల పేరు మీద పంచుకొని బిచ్చగాల్ల లెక్క ఓట్లు అడుగుతున్నారు. దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలి. 10 సంవత్సరాల బీజేపీ పాలన లో దేశం కోసమో... తెలంగాణ కోసమో.. వేములవాడ కోసమో..భీమారం కోసమో ఎం చేశారొ బీజేపీ నేతలు చెప్పాలి. తల్లి కి పుట్టిన బిడ్డ నర్స్ చెప్పే వరకు తెలియదంటున్న మూర్ఖుడు మన ఎంపి. ఇటువంటి వాడు మన ఎంపి అని   మాతృమూర్తులు అవమనపడుతున్నారు. రాజేందర్ రావు  చదువుకున్న వ్యక్తి...వాళ్ల నాన్న రాజకీయాల్లో ఉన్నాడు. మంచిగా పని చేస్తాడు .ఒక పక్క ఆది శ్రీనివాస్.. మరో పక్క రాజేందర్ రావు ఎంపిగా ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుంది..ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ మనవడు రాజీవ్ గాంధీ కొడుకు దేశం కోసం ఇంత కష్టపడుతుంటే పాదయాత్ర చేస్తుంటే నరేంద్ర మోడీ పూటకో వేషం వేస్తూ.. నొట్ల రద్దు చేసి , నిత్యవసర ధరలు  పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతూ మన ముందుకు వస్తున్నారు .జాగ్రత్త. ఇందిరమ్మ పాలన అంటే తల్లులందరికీ ఒక ఆశీర్వాదం.  ఇందిరమ్మ పాలన రావాలంటే మీ ఊర్లలో ఇల్లులేనివారికి ఇందిరమ్మ ఇళ్లు రావాలంటే.. రేషన్ కార్డులు రావాలంటే,4000 పెన్షన్ రావాలంటే , వరికి 500  బోనస్ రావాలంటే మమ్మల్ని గేలిపించినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ హామీలు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ది. మమ్మల్ని ఆశీర్వదించండి.. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటం.. ఎమ్మెల్యే గా మీ గౌరవాన్ని పెంచే విధంగా పని చేస్తాం.. మీ సమస్యలు పరిష్కరిస్తం.రాజేందర్ రావు ని ఆశీర్వదించి గెలిపించండని కోరారు

Related Posts