YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్...

 సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్...

భీమిలి, ఏప్రిల్ 29 
ఏపీలో కీలక నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. ఇక్కడ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఈయన కూడా మాజీ మంత్రి కావడంతో.. ఇద్దరి మధ్య గట్టి ఫైట్ ఉంది. వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలవాలని గంటా శ్రీనివాసరావు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావుకు టికెట్ దక్కదని అంతా భావించారు. కానీ చివరి వరకు భగీరథ ప్రయత్నం చేసిన గంటా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకోగలిగారు. ఇప్పుడు తప్పకుండా విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. ఇక్కడ అవంతి శ్రీనివాసరావు పై గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో.. మరోసారి పోటీ చేయరు గంటా. కానీ ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన భీమిలి నుంచి మరోసారి బరిలో దిగారు. 1999లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి తరుపున తొలిసారిగా పోటీ చేశారు. ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఆర్పి కాంగ్రెస్లో విలీనం కావడంతో మంత్రి పదవి చేపట్టారు. 2014లో టిడిపిలో చేరి భీమిలి నుంచి పోటీ చేసిన శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు భీమిలి నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అయితే గతం మాదిరిగా భీమిలి నుంచి గెలుపు అంత సునాయాసం కాదు. కానీ ఇక్కడ జనసేనకు బలం ఎక్కువగా ఉంది. అందుకే జనసేన కీలక నాయకులను వైసీపీలో చేర్పించారు. వలస పక్షులను భీమిలి ప్రజలు నమ్మరంటూ అవంతి శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే తాను భీమిలి వాడినని.. గతంలో గెలిచి ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని గంటా శ్రీనివాసరావు గుర్తు చేస్తున్నారు. మరోవైపు వైసీపీలో ఉన్న విభేదాలను గంటా శ్రీనివాసరావు క్యాష్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను టిడిపిలోకి రప్పిస్తున్నారు. జనసేన నేతలు వెళ్లిపోయిన క్యాడర్ మాత్రం గంటా శ్రీనివాసరావు గెలుపునకు కృషి చేస్తున్నడం కలిసి వచ్చే పరిణామం. మొత్తానికైతే భీమిలిలో విజయ గంట మోగించాలని గంటా శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి

Related Posts