YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీని లైట్ గా తీసుకున్న బీజేపీ

ఏపీని లైట్ గా తీసుకున్న బీజేపీ

విజయవాడ, ఏప్రిల్ 27 
ఏపీని బిజెపి లైట్ తీసుకుంటోందా? అందుకే కూటమిని పట్టించుకోవడం లేదా? బిజెపి అగ్ర నేతలు ప్రచారానికి రాకపోవడానికి అదే కారణమా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మూడు పార్టీలు కూటమి కట్టిన తర్వాత ప్రధాని మోదీ చిలకలూరిపేట సభకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ లతో వేదిక పంచుకున్నారు. అయితే నెల రోజులు గడుస్తున్నా… ప్రధాని మోదీ ఏపీ వైపు చూడకపోవడం కొద్దిపాటి అనుమానాలకు తావిస్తోంది.ఆరు నెలల కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేశారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి… అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ప్రధాని మోదీని విభేదించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసి మూల్యం చెల్లించుకున్నారు. తాను ఏ తప్పు చేశానో గుర్తించుకున్నారు. అందుకే మరోసారి ఎన్డీఏలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చివరకు ఎన్నికల ముంగిట బిజెపి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయ్యింది. బిజెపితో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినా ప్రచారం విషయంలో మాత్రం.. బిజెపి అగ్రనేతల నుంచి అనుకున్నంత స్థాయిలో సాయం దక్కడం లేదు. ఇంతవరకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటన షెడ్యూల్ ఖరారు కాలేదు. కానీ ఇదే సమయంలో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మాత్రం బిజెపి అగ్ర నేతలు క్యూ కడుతుండడం విశేషం.తెలంగాణలో బిజెపి ఒంటరి పోరాటం చేసింది. జనసేనతో పొత్తు పెట్టుకున్నా.. ప్రధాన పార్టీగా బిజెపి ఉండేది. అందుకే బిజెపి అగ్రనేతలు సైతం తెలంగాణ ఎన్నికల విషయంలో ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ప్రధాని మోదీ వరుస ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అయితే అక్కడ గెలిస్తే బిజెపి అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత ఆ జాబితాలో తెలంగాణ చేరుతుంది. అందుకే అక్కడ ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి అగ్రనేతలు భావించారు. వ్యూహంలో భాగంగానే అక్కడ వరుస పర్యటనలు చేశారు.తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో విభిన్న పరిస్థితి ఉంది. ఇక్కడ పొత్తులతో ముందుకెళ్తోంది. పొత్తులో సింహభాగం ప్రయోజనాలు ప్రధాన పార్టీ అయిన టిడిపికి దక్కుతాయి. అందుకే బిజెపి అగ్ర నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు తామెందుకు ప్రయత్నించాలన్నది బిజెపి అగ్ర నేతల వాదనగా తెలుస్తోంది. ఏప్రిల్ 30 తో పాటు మే 3,4 తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ విషయంలో మాత్రం ఎంతవరకు స్పష్టత లేదు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు బిజెపి ఒంటరి పోరు చేస్తుండగా.. పొత్తులో భాగంగా ఏపీలో ఆరు పార్లమెంట్ స్థానాల నుంచి బిజెపి పోటీ చేస్తోంది. అందుకే ఏపీ కంటే తెలంగాణకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే బిజెపి అగ్ర నేతలు ప్రచారానికి రాకపోవడం ఏపీలో కూటమి పార్టీలకు కాస్త ఇబ్బందికరమే

Related Posts