YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రసవత్తరం... గుంటూరు రాజకీయం

రసవత్తరం... గుంటూరు రాజకీయం

గుంటూరు, ఏప్రిల్ 29
గుంటూరు పశ్చిమ రాజకీయాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాక రేపుతున్నాయి.కమ్మ సామాజికవర్గ ఓటర్ల పట్టున్న కోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. తెలుగుదేశం, వైసీపీల నుండి ఇద్దరు బీసీ మహిళలే పోటీ పడుతున్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారంది. వైసీపీ అభ్యర్ధిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన విడదల రజినీ బరిలో ఉంటే, టీడీపీ అభ్యర్ధిగా రజక సామాజిక వర్గానికి చెందిన గళ్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలే కావడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అయితే మహిళా అభ్యర్ధులకు చెందిన భర్తలు మాత్రం అగ్రకులాలకు చెందిన వారు కావడం విశేషం.విడదల రజిని భర్త కాపు కులానికి చెందిన వారు. కాగా మాధవి భర్త రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిద్దరూ కూడా తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రచారాలకు మాత్రమే అభ్యర్ధులు పరిమితమైతే భర్తలు మాత్రం తెర వెనుక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. రజిని భర్త కుమార స్వామి ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలందరిని కలిసి తమకే మద్దతు ఇవ్వాలంటూ అడుగుతున్నారు. ఇక మాధవి భర్త రామచంద్రరావు కూడా అటు కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని కూడా కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఒక్క కాపు సామాజిక వర్గానికి కూడా టికెట్ ఇవ్వలేదని రాజకీయ పార్టీలపై గుర్రు మీద ఉన్నారు. అయితే కాపుల మద్దతు తమకే ఉంటుందని వైసీపీ భావిస్తుంటే, జనసేనతో జతకట్టడంతో కాపుల ఓట్లు తమకే పడతాయని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో పోరు కాపు వర్సెస్ కమ్మగా మారిపోయింది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలిద్దరూ కూడా కాపు ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. మరొకవైపు గత ఆరు ఎన్నికలను పరిశీలిస్తే, ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ సాధించలేకపోయింది. 1994, 1999ల్లో టీడీపీ గెలుపొందితే 2004, 2009ల్లో కాంగ్రెస్, 2014, 2019ల్లో టీడీపీ గెలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ తమకే వర్కవుట్ అవుతుందిన వైసీపీ భావిస్తుంటే, ఈసారి కాపు ఓట్లతో గెలిచి చరిత్ర తిరగరాస్తామని టీడీపీ అంటుంది. గెలుపు ఎవరిదైనా పోరు మాత్రం రంజుగా సాగుతోంది.

Related Posts