YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి సంజయ్ కు గుణపాఠం చెప్పాలి కేటీఆర్

బండి సంజయ్ కు గుణపాఠం చెప్పాలి కేటీఆర్

కరీంనగర్
కరీంనగర్ లోక్ సభ పరిధిలోని కరీంనగర్ టౌన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కేటీఆర్ మాట్లాడుత  వినోద్ అన్న గెలవటం ఖాయమేనా  ? బండి సంజయ్ షెడ్ కు పోవటం ఖాయమే కదా? కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు. నిన్నటి దాకా గౌరవమిచ్చిన పోలీసులు ఇప్పుడు తోక జాడిస్తున్నారు. మీరు 10-12 సీట్లు మనకు ఇవ్వాలె. మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని అన్నారు.
మనం గెలిస్తే నిన్నటి దాకా తోక జాడించినోళ్లు మళ్లీ సెట్ అయితరు.కరీంనగర్ ను అభివృద్ధి చేసేందుకు గంగుల కమలాకర్ గారు చాలా కష్టపడ్డారు. గంగుల కమలాకర్ గారికి 3 వేల మెజార్టీ రావటం నాకు బాధ అనిపించింది. మనది మనమే మెజార్టీ తగ్గించుకున్నాం. ఈ విషయం చెప్తే మీరు ఏమీ అనుకోవద్దు. బీజేపోళ్లు 10 మంది కూడా ఉండరు. కానీ మనం వార్డుకు 3 వందల మంది వరకు ఉంటాం.కానీ ఒకరి పేరు చెబితే ఒక్కరికి కోపం. అలా ఉండొద్దు. తల్లి లాంటి పార్టీ ని కొంతమంది లీడర్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సీటు రాదంటున్నాడు. రెండు సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటాడు. వినోదన్న గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంట అని బండి అంటాడు. మన వినోదన్నను గెలిపించి బండి రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలి. సిరిసిల్ల, హుజురాబాద్ మంచిగనే ఉన్నాయి. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండిలో బలంగా ఉండాలె. బడా భాయ్ చాలా హామీలు ఇచ్చి మోసం చేసిండు. ఇటు చోటా భాయ్ కూడా నోటికి ఎంత వస్తే అంత చెప్పి మోసం చేసిండు. కాంగ్రెస్ క్యాండిడేట్ ను గీతా భవన్ చౌరస్తాలో నిలబడితే ఒక్కడన్న గుర్తుపడుతాడా? కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, చేవేళ్ల లాంటి ప్రాంతాల్లో బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. కాంగ్రెస్ కోసం బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని అన్నారు.  
తల్లి లాంటి పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైతున్నయ్. అందుకే మీరంతా 13 రోజుల పాటు కష్టపడాలె. ఎందుకు గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలని కొందరు ప్రశ్నిస్తున్నారు వాళ్లందరికీ నేను ఎందుకు పార్లమెంట్ లో గులాబీ జెండా ఉండాలో చెప్తా. హైదరాబాద్ ను కేంద్ర పాలితం చేస్తారని నాకు కచ్చితంగా సమాచారం ఉంది. రాముడు కూడా రాజధర్మం పాటించాలని చెప్పిండు. మరి ఈ ప్రాంతానికి బండి సంజయ్ తన రాజధర్మాన్ని పాటించి చేయాల్సి పని చేయలేదు. కరీంనగర్ కు రూపాయి తేలేదు. ఒక్క శిలాఫలకం వేయలేదు.రాముడిని అడిగితే కూడా కచ్చితంగా బండి సంజయ్ ను ఓడించమని చెప్తుతాడు. బీజేపీ రాకముందే దేవుళ్లు ఉన్నారు. బీజేపీ ఓడిపోతే దేవుళ్లకు అయ్యేది లేదు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని ఓడిస్తే దేవుళ్లు కూడా సంతోషిస్తరు. దేవున్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే రాజకీయాలు చేస్తారో వాళ్లకు బుద్ధి చెప్దాం. ప్రశ్నలు అడగకుండా గాలి తిరుగుడు తిరిగే బండి సంజయ్ కు గుణపాఠం చెప్పాలె. ఇంటింటికి తిరిగి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలనని అన్నారు. .

Related Posts