YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ కు సిపీఎం షాక్...

కాంగ్రెస్ కు సిపీఎం షాక్...

నల్గోండ, ఏప్రిల్ 29,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన కామ్రేడ్లు.. లోక్ సభ ఎన్నికల్లో పంథా మార్చారు. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి కి కామ్రేడ్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఇటీవలే సీపీఎం ముఖ్య నాయకులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే.. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండడంతో.. దేశంలో బీజేపీని ఓడించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి సీపీఎం నేతలు కూడా అంగీకరించారు.కట్ చేస్తే.. సీపీఎం తరపున భువనగిరి పార్లమెంట్ స్థానంలో పోటీకి దిగిన జహంగీర్‌కు మద్దతు ఇవ్వాలని కామ్రేడ్లు కాంగ్రెస్ పార్టీని పట్టుబట్టారు. కానీ అందుకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ససేమిరా అనటంతో.. కామ్రేడ్లు రూట్ మార్చారు. తాము పోటీ చేస్తున్న భువనగిరి స్థానం నుంచి పోటీ తగ్గేదేలేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెప్పేశారు. దీంతో.. రాష్ట్రంలోని మిగతా స్థానాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. భువనగిరిలో మాత్రం మిత్రపక్షాల నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థికి పోటీ ఉండనుందన్న మాట.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం.. టి.జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి మహమ్మద్‌ జహంగీర్‌ను బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద శక్తుల ఓటమి కోసం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారం గురించి సమావేశంలో సమీక్షించారు.దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు బీజేపీ చేసిన అన్యాయాలను ఎండగట్టే కృషిని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ కృషికి తోడ్పడేందుకు, పార్టీ యొక్క స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గానూ భువనగిరి మినహా.. మిగిలిన 16 స్థానాల్లో మతోన్మాద బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నందుకు గానూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను బలపర్చాలని ప్రజలను కోరారు.

Related Posts