YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మోదీ నైతికంగా దిగజారారు మంత్రి పొన్నం ప్రభాకర్

మోదీ నైతికంగా దిగజారారు మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్
రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం. దెబ్బ తగిలిందనే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ బయటకి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  హైదరాబాద్ ని యూటీ చేయమని కొందరు అడిగితే సోనియా ఒప్పుకోలేదు. ఆత్మగౌరవం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు బీజేపీ నుండి బయటకి రండి. రిజర్వేషన్లు అంటే అసహ్య భావన ఉన్న బీజేపీని ఓడగొట్టండి. రిజర్వేషన్లు ముట్టుకుంటే మాడిమసై పోతారు. ఒక మంత్రిగా కాదు బీసీ బిడ్డగా మాట్లాడుతున్నా. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ప్రతి ఊర్లలో జేఏసీలు ఏర్పాటు చేసుకొని పోరాడుదాం. తెలంగాణ పోరాటం లాగా రిజర్వేషన్లు కాపాడుకునే పోరాటానికి సిద్ధంకండి. ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీయండి. నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణ గుడులకు చేసిందేంటి? పదేళ్లలో బీజేపీ ఎన్ని గుళ్ళు నిర్మించింది. మంగళ సూత్రాలు తెంచే సంస్కృతి మాది కాదు.ఆస్తులు ఇచ్చిన చరిత్ర తప్పా గుంజుకున్న చరిత్ర కాంగ్రెస్ కి లేదు. మోదీ నైతికంగా దిగజారారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారు. కుల గణనకి బీజేపీ వ్యతిరేకం. రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీ బీజేపీ. కాంగ్రెస్, మండల్ కమిషన్ తెస్తే జీర్ణించుకోలేక కమండల యాత్ర చేసింది బీజేపీ అని  అన్నారు.

Related Posts