YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమెరికాకు ఇరగవరం సర్పంచ్ హేమ

అమెరికాకు ఇరగవరం సర్పంచ్ హేమ

ఏలూరు, మే 2
అమెరికా ఐక్యరాజ్య సమితిలో నిర్వహించే గొప్ప సదస్సుకు ఏపీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్ ఎన్నికయ్యారు. మే 3న నిర్వహిస్తున్న 57వ మకిషన్ ఆన్ పాపులేషన్ అండే డెవలప్ మెంట్ సదస్సులో పాల్గొననున్నారు. ఏపీలో సీఎం జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే సామాజిక సమీకరణాలు, మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే 2021 ఏప్రిల్‎లో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఒక మహిళకు అవకాశమిచ్చారు సీఎం జగన్. ఆమె ఎన్నికైన ప్రభుత్వ పనితీరును, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యత, అభివృద్ది గురించి వివరించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈమె పేరును సిఫార్సు చేసింది. దీంతో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీని నిర్వహిస్తున్న 57వ మకిషన్ ఆన్ పాపులేషన్ అండే డెవలప్ మెంట్ సదర్సులో పాల్గొనేందుకు హేమ కుమారికి ఈ అదృష్టం వరించింది. ఈ ఐదేళ్ల పాలనలో మన రాష్ట్రం నుంచి పలువురు ఈ ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించేందుకు అవకాశాన్ని సంపాదించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తమ గ్రామంలోని విద్య, వైద్యం, మౌళిక వసతులు, అభివృద్ది గురించి వివరించేందుకు అవకాశం లభించగా, తాజాగా గ్రామ సర్పంచ్‎కు ఈ అదృష్టం వరించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూయర్క్ నగరం యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోర్ కార్యక్రమాంలో పాఠశాల విద్యార్థులకు అవకాశం లభించగా అమెరికా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రసంగించే అవకాశం ఈ సర్పంచ్‎కు లభించింది.ఆంధ్రప్రదేశ్ నుంచి సర్పంచ్ హేమ కుమారి, త్రిపుర నుంచి సెపాహిజాల జడ్పీ చైర్ పర్సన్ సుప్రియ దాస్‌దత్తా, రాజస్థాన్ నుంచి ఝంజున్ జిల్లా లంబిఅహిర్ సర్పంచ్ నీరూ యాదవ్‎లకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ముగ్గురుone  భారత దేశంలోని స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు, సాధించిన లక్ష్యల గురించి ప్రసంగించాల్సి ఉంటుంది. ఏపీ నుంచి ఎంపికైన సర్పంచ్ హేమ కుమారి 2022 లో కాకినాడ జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. అలాగే ఐదేళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్‎గా పనిచేశారు. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్ కుమార్ లతో కలిసి భారత్ ప్యానల్ తరుపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ది గురించి ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మూడు రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్యసమితికి సిఫార్సు చేయడం విశేషం.

Related Posts