YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనకు షార్ట్ రిలీఫ్

జనసేనకు షార్ట్ రిలీఫ్

విజయవాడ, మే 2,
జనసేనకు కొద్దిపాటి రిలీఫ్. ఆ పార్టీ గాజు గ్లాస్ విషయంలో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన పోటీలో లేని చోట్ల ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడమే అందుకు కారణం. దీనిపై రెండుసార్లు ప్రత్యేకంగా విన్నవించినా ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తీరా నామినేషన్ల ఉపసంహరణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 కి పైగా అసెంబ్లీ,పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం గందరగోళానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు 24 గంటల వ్యవధిలో దీనికి పరిష్కార మార్గం చూపిస్తామని ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.జనసేన పార్టీలో భాగంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేస్తున్న వర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ఇండిపెండెంట్ లకు కేటాయించారు. ఇది కూటమి పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. తప్పకుండా ఓట్లు చీలిపోతాయని ఆ పార్టీల్లో ఆందోళన కనిపిస్తోంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 24 గంటల వ్యవధిలో పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఆ మేరకు స్పందించింది.జనసేన కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాల్లో.. ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తు లేకుండా చూస్తామని ఈసి స్పష్టం చేసింది. అయితే దాదాపు 50 కి పైగా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన నేపథ్యంలో.. మరో 35 నియోజకవర్గాల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. అక్కడ సైతం గాజు గ్లాస్ గుర్తు ఇవ్వద్దని కోరుతూ జనసేన ప్రత్యేకంగా అభ్యర్థిస్తోంది. అయితే కాకినాడ, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో మాత్రం గాజు గ్లాస్ గుర్తు కేటాయించమని ఎలక్షన్ కమిషన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మిగతా నియోజకవర్గాల్లో సైతం గాజు గ్లాసు గుర్తు ఇవ్వకుండా చూడాలని జనసేన ప్రయత్నిస్తోంది. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Related Posts