YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శుక్రవారం నెల్లూరుకు బాబు,పవన్

శుక్రవారం  నెల్లూరుకు బాబు,పవన్

నెల్లూరు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు నెల్లూరులో పర్యటించనున్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం పు సాయంత్రం 5:30 గంటలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ KVR పెట్రోల్ బంక్ నుండి రోడ్ షోలో పాల్గొంటారన్నారు. అనంతరం VRC సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Related Posts