YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శంషాబాద్ లో మళ్లీ చిరుత

శంషాబాద్ లో మళ్లీ చిరుత

హైదరాబాద్, మే 2
శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో చిరుత పెద్ద సమస్యగా తయారయింది. ఐదు రోజులుగా అక్కడే తిరుగుతోంది కానీ పట్టుకుందామంటే చిక్కడం లేదు. ఈరోజు రన్‌వే సమీపంలో ఏర్పాటుచేసిన ట్రాప్‌ కెమెరాలకు మళ్ళింది చిక్కింది చిరుత. 6 రోజుల క్రితం కూడా ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపైనే కనిపించింది. అప్పటి నుంచి దాన్ని పట్టుకుందామని ఎయిర్ పోటర్ సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆపరేషన్ చిరుత పేరుతో ప్రత్యేక బృందాలు కూడా వచ్చాయి. అయినా కూడా 6 రోజుల నుంచి చిక్కకుండా అధికారులకు ముప్పు తిప్పలు పెడుతోంది. చిరుతను బంధించేందుకు రోజురోజుకూ అటవీశాఖాధికారులు బోన్ల సంఖ్యను పెంచుకుంటే వెళుతున్నారు. ఆరు రోజులుగా చిరుత ఎయిర్ పోర్ట్ సిబ్బంది కి , ప్రత్యేక బృందాలకు చిక్కడమే లేదు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ అది మాత్రం తప్పించుకుంటోంది. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు చిరుతను పట్టుకోవడానికి బోనులో మేకను ఎరగా కూడా వేశారు. అయితే అది మాత్రం చాలా తెలివిగా బోను వరకు వస్తోంది కానీ అందులోకి దూరడం లేదు. మేకను చూసి కూడా లోపలికి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒకే ప్రాంతంలో తిరుగుతోంది కానీ ట్రాప్‌కు మాత్రం దొరకడం లేదు.ఎయిర్‌పోర్టు పక్కన చెట్ల మధ్యలో చిరుత దాక్కుని ఉందని అటవీశాఖ ప్రత్యేక బృందాలు చెబుతున్నాయి. చిరుతను బంధించేందుకు 5 బృందాలుగా అధికారులు గాలిస్తున్నారు. ట్రాప్‌ కెమెరా విజువల్స్‌ ఆధారంగా పులి సంచరిస్తున్న 2 ప్లేసులు గుర్తించారు.ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో నిఘా వేశారు. దాని బట్టి ఇవాళ కచ్చితంగా చిరుతను పట్టుకుంటామంటున్నారు ఫారెస్ట్‌ అధికారులు.

Related Posts