YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కవితకు మళ్లీ నిరాశే

కవితకు మళ్లీ నిరాశే

న్యూఢిల్లీ, మే 2
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మళ్ళీ వాయిదా పడింది. దీనిని మరో నాలుగు రోజుల తర్వాతకు అంటే మే 6కు వాయిదా వేస్తున్నట్టు స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా తెలిపారు. ఈ నెల 7తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. ఇప్పడు దానికన్నా ఒకరోజు ముందే కవిత బెయిల్ మీద రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తుది తీర్పు వెలువడనుంది. ఈ తీర్పును ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు చెప్పనుంది. అంతకు ముందు సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఇరు పక్షాలు తమ వాదనలను కోర్టుకు వినిపించాయి. అనంతరం బెయిల్‌పై కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిష్ మీద తీర్పు ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 22న వాదనలు జరిగాయి. కవిత లాయర్లు, సీబీఐ తరుఫు లాయర్లు ఇద్దరూ కోర్టుకు తమతమ వాదనలు వినిపించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని..కవిత మహిళ కాబట్టి పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని కవిత లాయర్‌ వాదనలు వినిపించారు. సరైన ఆధారాలు లేని కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కవిత లాయర్ విక్రమ్‌ చౌదరి కోర్టులో వాదించారు. ఇక మద్యం కుంభకోణంలో కవితదే కీలక పాత్ర అని సీబీఐ తరుఫు లాయర్‌ వాదించారు. ఆమె బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని..కాబట్టి బెయిల్‌ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు.

Related Posts