YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రిసర్చ్ చేసి దోపిడి చేస్తున్న రేవంత్

రిసర్చ్ చేసి దోపిడి చేస్తున్న రేవంత్

హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసర్చ్ చేసి మరీ దోపిడీ చేస్తున్నారు. అబద్దాల పునాదుల మీద, రాష్ర్ట ప్రజలని మోసం చేసి గద్దేనెక్కిండని బీజుపీ సిఎల్సీ నేత మహేశ్వర రెడ్డి అన్నారు. కడుపు కట్టుకుంటే 40 వేల కోట్లు బ్యాంక్ లకు కట్టొచ్చు అంటున్నావు.. ఎలా వస్తాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టాక్స్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా. హైదరాబాద్ పరిసరాల్లో పర్మిషన్ లు ఆపి... ఇప్పుడు పర్మిషన్ లు ఇవ్వడానికి కారణం. 2022...23 లో మూడు వేల ప్రాజెక్ట్ లకు పర్మిషన్ లు ఇచ్చారు. ప్రతి ఏడాది 120 కోట్ల చదరపు అడుగులు అనుమతులు ఇస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ .. సెటిల్ మెంట్ ఇమేజ్ గా మారిందట. రేవంత్ రెడ్డి చదరపు అడుగుకు వంద రూపాయలు అడుగుతున్నారు అట. బిల్డరు లు అంత ఇవ్వలేము అంటే చివరికి 65 రూపాయలకు ఫిక్స్  చేసుకున్నారు అట. అంత క్యాష్ అండ్ క్యారీ బిల్లులు ఉండవు. వేల కోట్లు అవినీతి జరుగుతుంది.కేటీఆర్ కి ఇచ్చినట్టు ఫ్లాట్స్ ఇస్తామని అంటే డబ్బులే ఇవ్వాలని అంటున్నారు అట. ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. దోపిడీ కి రాష్ట్ర ఆదాయానికి సంబంధం ఏంటి రేవంత్ రెడ్డీ...(రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో వినిపించిన మహేశ్వర్ రెడ్డి). రేవంత్ రెడ్డి దొరికిపోయాడు. మరో రెండు మూడు రోజుల్లో మరో టాక్స్  బయట పెడతా, రిజర్వేషన్ ల పై రేవంత్ రెడ్డీ మూర్ఖత్వం తో మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ లని బిజెపి పెంచింది కానీ తగ్గించలేదని అన్నారు.

Related Posts