YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంద శాతం ఓటు వేద్దాం - దేశాన్ని గెలిపిద్దాం -ఏబీవీపీ

వంద శాతం ఓటు వేద్దాం - దేశాన్ని గెలిపిద్దాం -ఏబీవీపీ

ఎమ్మిగనూరు
పట్టణం లో స్థానిక కళాశాలల లో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్ ఆధ్వర్యంలో నేషన్ ఫస్ట్ - ఓటింగ్ మస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మారుతి యువత ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ప్రజాస్వామ్యాన్ని
బలోపేతం చేసే అవకాశం మరొక సారి మన ముందుకొచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా మే 13 న జరుగబోతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో 98 కోట్లకు పైగా దేశ ప్రజలు తమ చేతిలోని ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోనున్నారు. ఇందులో సగానికి పైగా యువ ఓటర్లు ఉన్నారు. రెండు కోట్లకు పైగా నూతన ఓటర్లు మొట్టమొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. దేశ భవిష్యత్తుకు బాటలు వేసేది మన ఓటే .
ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు తమ భవితను దేశ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే అధికారం మరియు అవకాశం ఓటు కలుగజేస్తోంది. మన భవిష్యత్తు ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. మన శాసనసభ, పార్లమెంటుకు ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజాస్వామ్య దేశంలో మన విధి. రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఓటు హక్కును పొందడం మన అదృష్టం. మన ఓటు ఒక వ్యక్తిని, పార్టీని ఓడించవచ్చు లేదా విజయతీరాలకు చేర్చవచ్చు.
మన ఓటు కారణంగానే దేశం మారుతున్నది.
గత రెండు లోక్ సభ పర్యాయాలు 'ఓటర్' లు చూపించిన చైతన్యం, విజ్ఞత కారణంగా గత దశాబ్ద కాలంగా దేశంలో సుస్థిరమైన జాతీయ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పదేళ్ళ క్రితం నిత్యకృత్యమైన స్కాములు నేడు కానరావడం లేదు. నాడు దేశం నలుమూలలలో నిత్యం పేలే బాంబుల మోతలతో సామాన్య ప్రజల మరణాలు, ఆహాకారాలు ఆగిపోయాయి. వాటికి కారణమైన ఉగ్రవాదుల ఆటలు అరికట్టబడ్డాయి. అరాచకవాదుల పునాదులు బుల్డోజరుతో కూల్చివేయబడ్డాయి. ప్రపంచ పటంలో భారతదేశ కీర్తిప్రతిష్ఠలు పతాకశీర్షికకు చేరాయి. ఏ దేశ విదేశాంగ విధానమైనా భారత్ సెంట్రిక్ గా జరిగే కాలం రానే వచ్చింది. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన మన బిడ్డలు మేం భారతీయులమని సగర్వంగా చెప్పుకునే స్థాయికి చేరాం. మన విద్యార్థులను భద్రంగా తీసుకురావడం కోసమే రెండు దేశాలు యుద్ధానికి తాత్కాలిక విరామమివ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. మూడవ ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అడుగుల్ని వేస్తూనే, పేదరిక నిర్మూలన, రైతుల్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.
అనేక సంవత్సరాలుగా దేశంలో నెలకొని ఉన్న అస్థిరత దీర్ఘకాలిక సమస్యలైన ఆర్టికల్ 370, అయోధ్యలో భవ్యమైన శ్రీ రామ మందిరం నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళలు కు చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్లు, సిఏఏ అమలు, నూతన జాతీయ విద్యావిధానం తీసుకురావడం సమస్యలను దీటుగా ఎదుర్కోవడం, ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించడం, శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రోత్సాహంతో సాధిస్తున్నటువంటి అద్భుతమైన విజయాలు, స్వావలంబన వైపు అడుగులు, యువతకు ఉపాధి మార్గాలు చూపెట్టడం, Skill India అద్భుత ప్రగతి సాధిస్తున్న రైల్వే, రోడ్డు, రవాణా రంగాలు, క్రీడల ప్రోత్సాహంతో అద్భుత విజయాలు సాధిస్తున్నటువంటి క్రీడాకారులు, ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇలా ఎన్నో విజయాలు సాధిస్తూ, సమస్యల పరిష్కారం అవుతున్నాయి అంటే దీనికి కారణం విజ్ఞులైన ఓటరు ఇచ్చిన సుస్థిర ప్రభుత్వం కారణంగానే.
ప్రలోభాలకు లొంగిపోకూడదు .
ప్రజాస్వామ్యంలో ఎంతో పవిత్రమైన విలువగల" ఓటు 'ను అమ్ముకోవడం అంటే మన పతనాన్ని మనం కోరుకోవడమే. పావలాకో-పరకకో, మద్యం ప్యాకెట్ కో - కానుకలకో ఆశపడి ఓటు వేసే ఆ రోజు ప్రలోభాలకు లొంగిపోతే, 1825 రోజుల విలువైన కాలాన్ని అభివృద్ధిని నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం. అంతేకాదు మనం ప్రశ్నించే అర్హత కూడా కోల్పోతాం. మన కుటుంబ, దేశ భవిష్యత్తును అవినీతిపరుల చేతుల్లోకి పెట్టి మనం అంధకారంలోకి నెట్టబడుతాం, మంచి పాలకులను ఎన్నుకుంటే మన అభివృద్ధిని, మన భవిష్యత్ తరాలకు మంచి పునాది వేసే అవకాశం లభిస్తుంది.
NOTA కు ఓటు వేయద్దు
విద్యాధిక ప్రగతి వాదులు గా చెప్పుకునే కొందరు చేస్తున్న మరో తప్పిదం NOTAకు ఓటు వేయడం. ఇదేదో గొప్ప విషయమన్నట్లు కొన్ని శక్తులు ప్రచారం చేయడం కారణంగా చాలామంది NOTA కి ఓటు వేయడాన్ని గొప్పగా భావిస్తున్నారు. నిజానికి NOTA మీట నొక్కడమంటే, మన ఓటును వ్యర్థం చేసుకోవడమే. NOTA కి ఓటు వెయ్యడం వల్ల అనర్హుల గెలుపును అడ్డుకోగలమా ? లేదు కదా ? అలాంటప్పుడు ఉన్నవారిలోనే మెరుగైన వారికి ఎందుకు ఓటెయ్యకూడదు ? నిరుపయోగమైన NOTA ని వదిలేద్దాం. ఉన్నవారిలో మెరుగైన వారికి ఓటు వెయ్యడం ద్వారా మన ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించడంలో క్రియాశీల పాత్ర పోషిద్దాం.
100% ఓటింగ్ లక్ష్యం కావాలి
- ఓటరు ను చైతన్యం చేయాలి
దేశంలో రావాల్సిన మార్పుల నుంచి అభివృద్ధిని గురించి గంటల కొద్దీ ఉపన్యాసాలు చెప్పే మనలోని కొందరు ఓటు వేయాల్సిన రోజు సెలవు దినంగా భావించి ఇతర పనులలో మునిగిపోతున్నారా? నిజానికి గ్రామీణులు, పెద్దగా చదువుకోని వారికంటే విద్యాధికులే ఓటింగ్ కి దూరంగా ఉంటున్నారు. కేవలం 65 శాతం మంది మాత్రమే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తున్నారు . ఇది దేశానికి ప్రమాదకరంఓటువిలువ గురించి ప్రజలను చైతన్య వంతులను చేద్దాం. అందరం ఓటేద్దాం. 100% ఓటింగ్ ను నమోదు చేయిద్దాం.
దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను మన ఓటుతో తుదముట్టించాలి.
కర్నూలు జిల్లా ఉత్తేజిత ప్రతినిధి ఎమ్మిగనూరు మే 2 గురువారం
గత దశాబ్ద కాలంలో దేశం సాధిస్తున్న విజయాలను, ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిని చూసి ఓర్వలేని విదేశీ శక్తులు ప్రాంతం పేరుతోనో, కులం పేరుతోనో, మతం పేరుతోనో, భాష పేరుతోనో, భావజాలం పేరుతోనో మనమధ్య కుంపటి రాజేయడానికి విదేశీ భావజాల గుంటనక్కలు కాచుకుకూర్చున్నారు. దేశంలోని జాతివ్యతిరేకశక్తులు, స్వార్థ హింస రాజకీయ నాయకు లు తుక్తే గ్యాంగ్ లతో కలిసి దేశాన్ని అస్థిర పరిచే కుట్రను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. విదేశీ విద్రోహులు దన్నుతో, ఆర్థిక సహకారంతో టూల్ కిట్ గ్యాంగ్ లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ తిప్పికొట్టాల్సిన సమయం రానేవచ్చింది. కుట్రల్ని పాతరేసి అభివృద్ధిని నిరంతరాయంగా కొనసాగించాలంటే దేశ కీర్తిప్రతిష్ఠల ను మరింత ఇనుమడింప చేయాలంటే మే 13న మనమంతా (100%) ఓటింగ్ కోసం కదలాలి. దేశాన్నే గెలిపించాలి. విద్యార్థులు, యువత, మహిళలు నడుంభిగిస్తేనే దేశకీర్తి పతాక ప్రపంచ యవనిక పై రెపరెపలాడుతుంది. భారత్ విశ్వ గురువుగా నిలుస్తుంది. దేశపౌరులుగా మనతో పాటు మనతల్లిదండ్రులను, కుటుంబసభ్యులను, బంధుమిత్రులందరిని ఆలోచింపజేద్దాం. ప్రలోభాలకు లొంగకుండా దేశ అభివృద్ధికి, భవిష్యత్తుకు ఓటేద్దాం, ఓటేపిద్దాం. ప్రజాస్వామ్యాన్ని పండుగలా జరుపుకుందామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు

Related Posts