YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సంజయ్ కామెంట్స్ తో మరింత కలవరం

సంజయ్ కామెంట్స్ తో మరింత కలవరం

హైదరాబాద్, మే 4,
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ ఇటీవల కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు ఈకేసు విచారణలో దూకుడు ప్రదర్శించిన సిట్‌.. ఇప్పుడు వెనకాముందు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో జైల్లో ఉన్న పోలీసు అధికారులకు బెయిల్‌ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కీలక ఆధారాలు బయటపెట్టారు.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన సూత్రదాని కేసీఆర్‌ అని రాధాకిషన్‌రావు అంగీకరించారని బండి సంజయ్‌ వెల్లడించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు పలుమార్లు చెప్పినట్లు తెలిపారు. అయినా పోలీసులు కేసీఆర్‌కు నోటీసులు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తన మాటలకు ఆధారం కూడా చూపించారు. ఈమేరకు కన్ఫెషన్‌ రిపోర్టును ఆయన మీడియా ముందు ఉంచారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆ రిపోర్టును పరిశీలిసేత రాధాకిషన్‌రావు అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. అంత వివరంగా కేసీఆర్‌ గురించిం.. కేసీఆర్‌ కోసం ఏం చేశామో చెప్పినా, తనపాత్రపై రాధాకిషన్‌రావు అంగీకరించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మొన్నటి వరకు ట్యాపింగ్‌ కేసులో దూకుడు ప్రదర్శించిన పోలీసులు ఇప్పుడు పట్టించుకోకపోవడం, రాధాకిషన్‌రావు విచారణలో కేసీఆర్‌ పేరు బయట పెట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కాంప్రమైజ్‌ అయ్యారా అన్న సందేహాలను బీజేపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యహారంలో కేసీఆర్‌ను కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.ఇక ట్యాపింగ్‌ బాధితుల్లో మొదట రేవంత్‌ అయితే.. తర్వాత తానేనని బండి సంజయ్‌ తెలిపారు. తర్వాత హరీశ్‌రావు కూడా బాధితుడే అని పేర్కొన్నారు. అందుకే అతనికి ఏడాది పాటు మంత్రి పదవి ఇవ్వలేదని వెల్లడించారు. ఈ కేసు నుంచి కేసీఆర్‌ను కాపాడేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.కేసీఆర్‌ను కాపాడేందకు తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలను బండి సంజయ్‌ అడ్డుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకోసమే ఆయన కన్ఫెషన్‌ రిపోట్టు బయట పెట్టారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు బండికి సీఎం రేవంత్‌ నుంచి కూడా సహకారం అందుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కీలక డాక్యుమెంట్లు బయటకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నాలకు చెక్‌ పెట్టడానికి వ్వూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ఈ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

Related Posts