YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దోస్త్... అడ్మిషన్లు షురూ...

దోస్త్...  అడ్మిషన్లు షురూ...

హైదరాబాద్, మే 4
 తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ  నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మే 6వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మూడు విడతలలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.ఇంటర్ లో పాసైన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1000కి పైగా కాలేజీల్లో ఈ ఏడాది నాలుగున్నర లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ మే 6వ తేదీ నుంచి 25 వరకూ నిర్వహించనున్నారు. విద్యార్థులు రూ.200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 3న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 4 నుంచి 10లోగా విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టు చేసేందుకు అవకాశం కల్పించారు.
సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ జూన్ 4 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. రెండోదశలో అప్లై చేసుకునే విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 4 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు, 18న సీట్ల కేటాయింపులు చేపడుతారు. జూన్ 19 నుంచి 24 వరకు స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూన్ 19 నుంచి 25 వరకూ జరుగుతాయి. రూ.400 ఫీజుతో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూన్ 29న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 8 నుంచి విద్యార్థులకు డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి.

Related Posts