YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యువత ఎటు వైపు

యువత ఎటు వైపు

వరంగల్, మే 4,
పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం హోరెత్తుతోంది. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రయ ప్రారంభం కానుంది. గెలుపు ధీమాతో ఉన్న పార్టీలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నికలలో ప్రధానంగా యువకులు నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం విశేసం. ఈ యువ ఓటర్ల చేతిలో కీలక నేతల భవిష్యత్ తేలనుంది. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉంటే.. వారిలో 8 లక్షల కొత్తగా నమోదయిన యువ ఓటర్లు ఉన్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో 19.74 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. ఇక తెలంగాణలో చూస్తే యువ (పురుష) ఓటర్లు 64 లక్షల 89 వేల 502 కాగా.. యువ (మహిళ) ఓటర్లు 63 లక్షల 93 వేల 703గా ఉన్నాయి. 18 నుంచి 39 ఏళ్ల వయసున్న వారు కోటి 28 లక్షల 83 వేల 205 మంది ఉన్నారు. ఇలా యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున చాలా సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు యువమంత్రాన్ని జపిస్తున్నారు. రాష్ట్రంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివిధ పార్టీల నేతలంతా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. యువ ఓటర్లతో మాట్లాడేందుకు యువ నాయకులను రంగంలోకి దించారు. ఇలా అన్ని పార్టీలు యువతను టార్గెట్ చేయగా.. వారు ఎటువైపు మొగ్గు చూపుతారో అని ఆసక్తిదాయకంగా మారింది.
ప్రధానంగా యువ ఓటర్లు తమకు ఉన్న సమస్య నిరుద్యోగం. నిరుద్యోగులను ఆదుకుంటాం, వాళ్లకి అవి చేస్తాం..ఇవి చేస్తాం అంటూ పనికిరాని హామీలనిస్తూ వాళ్లను ఇన్నళ్లూ వాడుకున్నారు రాజకీయ నేతలు. నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధితో పనిచేసే లీడర్ కోసం యువ ఓటర్లు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య ఏటికేడూ పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 37 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ అప్పటి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం అయిన ఉద్యోగాలను నమ్ముకుని నిరుద్యోగ యువత ఆగం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతున్న నాటి కేసీఆర్‌ ప్రభుత్వం చేసింది మాత్రం 46 వేలు మాత్రమే అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగావకాశాలను ప్రభుత్వం కల్పించలేకపోయిందనే విమర్శలొచ్చాయి అప్పట్లో. డిగ్రీలు పూర్తి చేసిన 33.90 లక్షలమంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రభుత్వ వెబ్ సైట్ లోనే స్పష్టం చేసింది అప్పట్లో. ఓకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు సుమారు 3 లక్షలకు పైగా ఉన్నారని సమాచారం. ఒక్క ఏడాది కాలంలోనే రాష్ట్రంలో నిరుద్యోగ సగటు 2.2 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోనే కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది. వేలాది ఖాళీల భర్తీకి గ్రూప్ -1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేశామని, జూన్ లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో 50 వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రిక్రూట్ మెంట్ డ్రైవ్ లు చేపట్టడంలో విఫలమైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి తోడు 2022లో టీఎస్పీఎస్సీ గ్రూప్-1, ఇతర నియామక పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం, పరీక్షల రద్దు బీఆర్ఎస్ పై ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని, యూపీఎస్సీ తరహాలో 2025 నుంచి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన లాంటి హామీలతో కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది. ఇక కాంగ్రెస్ ‘యువరోషిణి’ కార్యక్రమం కింద స్టార్టప్ లకు రూ.5,000 కోట్ల కార్పస్ ను కేటాయించాలని ప్రతిపాదించింది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి కసరత్తులు చేస్తున్నాయి. . జాబ్ క్యాలెండర్, ఇతర నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ బీఆర్ఎస్, బీజేపీలు పదేళ్ల కాలంలో నిరుద్యోగులను మోసం చేశాయనే భావనలో ఉన్నారు యువ ఓటర్లు. అధిక శాతం యువ ఓటర్లు కాంగ్రెస్ విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

Related Posts