YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈనెల 7న ఎన్నికల ప్రచారానికి రానున్న హీరో వెంకటేష్

ఈనెల 7న ఎన్నికల ప్రచారానికి రానున్న హీరో వెంకటేష్

ఖమ్మం
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత, కొడుకు అర్జున్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయ స్వప్ని రెడ్డి  ప్రచారాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం, కమలాపురం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి రామ సహాయం రఘురాం రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత మాట్లాడుతూ ఈనెల 7న తన మామయ్య రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ తన తండ్రి వెంకటేష్ ప్రచారానికి రానున్నట్లు ఆమె తెలిపారు.

Related Posts