YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అరబిందో ఫర్మాకు జీఎస్టీ నోటీసులు

అరబిందో ఫర్మాకు జీఎస్టీ నోటీసులు

హైదరాబాద్
తప్పుడు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ అభియోగంపై అరబిందో ఫార్మాకు జీఎ్సటీ అధికారుల నుంచి వడ్డీ, పెనాల్టీ సహా రూ.13 కోట్ల డిమాండ్ నోటీసు అందింది. హైదరాబాద్లోని పంజాగుట్ట డివిజన్ డిప్యూటీ కమిషనర్ (ఎస్టీ) ఎస్టీయూ-1 నుంచి ఈ పన్ను నోటీసు అందినట్టు అరబిందో ఫార్మా రెగ్యులేటరీ సంస్థలకు పంపిన ప్రకటనలో తెలిపింది.
రూ.6,54,50,645 ఐటీసీ రివర్సల్తో పాటు వడ్డీగా రూ.5,92,20,900, పెనాల్టీగా రూ.65,51,354 చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించినట్టు పేర్కొంది. దీనిపై అప్పిలేట్ యంత్రాంగం ముందు అప్పీల్ చేయనున్నట్టు కూడా తెలియచేసింది. తమ ఆర్థిక వ్యవహారాలపై గాని, కంపెనీ కార్యకలాపాలపై గాని దీని ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది.

Related Posts