YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సివిల్స్ ర్యాంకర్లకు వెంకయ్య నాయుడు తో సత్కారం

సివిల్స్ ర్యాంకర్లకు వెంకయ్య నాయుడు తో సత్కారం

హైదరాబాద్
2023 యూపీఎస్సీ ఫలితాల్లో భాగంగా కేపీ 21st సెంచరీ ఐఏఎస్ అకాడెమీ తమ అల్ ఇండియా ర్యాంకర్లతో… మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సివిల్ సర్వెంట్స్, ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తారు.  వివిధ భాషలు, వివిధ సంస్కృతులు ఉన్నాయి. మనకి రాజకీయ నేతల ఆధిపత్యం ఉండొచ్చు కానీ నిజానికి భగవద్గీతా, రాజ్యాంగమే ప్రధానం అని గుర్తుంచుకోవాలి. మీరు ప్రభుత్వానికి ప్రతురూపాలు, సీఎం, ఎమ్మెల్యే ఎంతో మంది ఉండొచ్చు కానీ మీ ధర్మం మీరు పాటించాలి అప్పుడే మీ పనితనం తెలుస్తుంది. ప్రకృతి మన జీవితం, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతితో జీవించాలి. ఎవ్వరూ కూడా కన్న తల్లిని, జన్మ భూమిని , మాతృ భాషని మర్చిపోకూడదు అలా మర్చిపోతే వాళ్లు మనీషులే కాదు. మీ అడుగులని మీరు అనుసరిస్తే విజయం మీదే అవుతుంది. ఎప్పుడైనా పాజిటివ్ గా ఉండాలి. భారత దేశంలో ఇంకా 55 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయని అన్నరు.
గ్రామీణ ప్రాంతాల వారికి ప్రత్యేకత ఇవ్వండి, వారిని అభివృద్ధి చెయ్యండి. మీ నిజాయితీ అనేది మీ వృత్తిపై, రాజ్యాంగంపై ఉండాలి ఇతర ఎటువంటి ఒత్తిళ్ళపై కాదు. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, వారికి ఐఏఎస్ ఆఫీసర్లు తోలుబమ్మల్లా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగానికి, ప్రభుత్వానికి ప్రతిబింబంలా సివిల్ సర్వెంట్లు వ్యవహరిస్తారు, వ్యవహరించాలి అని ర్యాంకర్లను ఉత్తేజ పరిచేలా ప్రసంగించారు.

Related Posts