YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ లో భారీగా పట్టుబడుతున్న నగదు

హైదరాబాద్ లో భారీగా పట్టుబడుతున్న నగదు

హైదరాబాద్, మే 4
తెలంగాణ వ్యా్ప్తంగా వివిధ జిల్లాల్లో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతూనే ఉంది. అయితే కేవలం హైదరాబాద్ పరిధిలోనే భారీ మొత్తంలో డబ్బులు పట్టబడినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల నేతలు ఇప్పటికే ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులు ఇతర రవాణా మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ప్రత్యేక బృందాలుగా విడిపోయి అన్ని జిల్లాల్లో విస్తృతంగా తనిఖీ చేపట్టారు. ఇప్పటి వరకు రూ.21 కోట్ల 85 లక్షల 37 వేల 377 నగదుతో పాటు 16 కోట్ల 70 లక్షల 35 వేల 260 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 26,576.325 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్నికల కోడ్‎ను ఉల్లంఘించినందుకు 276 మందిపై కేసులు నమోదు చేసి 274 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 582 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారని తెలిపారు. 376 మందిపై ఎఫ్ఐఆర్‎లు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఎంసిసి ఉల్లంఘనలపై 38 ఫిర్యాదులు రాగా, అన్నింటిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారి.కేవలం గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.14 లక్షల 582 నగదు, 3,55,584/-రూపాయల విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 59.76 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, 6 కేసులు నమోదు చేసి 7 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 10 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, 7 ఎఫ్ఐఆర్‎లు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 5,75,58,955/-, పోలీస్, ఐటి శాఖ ద్వారా రూ.15,79,84,182/-, ఎస్ఎస్‎టి బృందాల ద్వారా రూ.29,94,240/- నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

Related Posts