YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రేసులోకి వచ్చిన కాంగ్రెస్

రేసులోకి వచ్చిన కాంగ్రెస్

అనంతపురం, మే 6
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో ఇక్కడ్నుంచి రెండు సార్లు గెలిచారు. మారిన పరిస్థితుల్లో మరోసారి తనను ఆదరించాలని ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు. శింగనమలలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్దులకు ఆ పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు అందటం లేదనే అభిప్రాయం ఉంది. దీన్ని అసరాగా చేసుకుని శైలజానాథ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో అన్ని చోట్లా ద్విముఖ పోటీలు జరుగుతున్నాయి. శింగనమలలో త్రిముఖ పోటీ ఉంది. మూడు పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. రెండు వారాల కిందటి వరకూ టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ ఉండేది. రెండు సార్లు శాసనసభ్యులుగా గెలిచిన మాజీ మంత్రి శైలజానాథ్‌ తన హయాంలో సింగనమల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో శైలజానాథ్‌ దూసుకుపోతున్నారు. శైలజానాథ్‌కు ఉన్న పరిచయాలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదు. ఇతర పార్టీల వారితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు.ఇప్పుడు ఇదే ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శింగనమల రిజర్వుడు నియోజకవర్గం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమె గెలిచే చాన్స్ లేకపోవడంతో అభ్యర్థిని మార్చాలనుకున్నారు. అయితే పద్మావతి భర్త సాంబశివారెడ్డి తాము చెప్పిన వారికే సీటివ్వాలని పట్టుబట్టిన తన వద్ద టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్న వీరాంజనేయులుకు టిక్కెట్ ఇప్పించుకున్నారు. నియోజకవర్గం మొత్తం ఆయన అభ్యర్థి కాదని.. సాంబశివారెడ్డినే అభ్యర్థి అనే క్లారిటీ ఉంది. విరాంజనేయులు గెలిచినా టిప్పర్ డ్రైవర్ గానే ఉంటారు… సాంబశివారెడ్డినే పెత్తనం చేస్తారు. అందుకే వారి పెత్తనంపై వ్యతిరేకతో ఉన్న వారు వైసీపీలో ఉన్నప్పటికీ సపోర్ట్ చేయడం లేదు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి కూడా సొంతపార్టీలో వ్యతిరేకత ఉంది. ఆమెను మార్చాల్సిందేనని మొదట్లో పట్టుబట్టారు. అయితే చంద్రబాబు సర్ది చెప్పడంతో తర్వాత అందరూ కలసి పని చేస్తున్నారు. శ్రావణి పరిస్థితి అనుకూలంగా ఉందని టీడీపీ గట్టి నమ్మకంతో ఉంది. యువ నేత కావడంతో .. గ్రామాల్లో యువతను ఆకర్షిస్తున్నారు. త్రిముఖ పోటీలో ఏదైనా జరగొచ్చన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ గెలిస్తే మాత్రం అదో సంచలనం అవుతుంది.

Related Posts