YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్..

భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్..

విజయవాడ, మే 6
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఉద్యోగుల చైతన్యం దేనికి సంకేతం? తొలి రోజే కదం తొక్కడం ఎవరికి ఇబ్బందికరం? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనపై ఉద్యోగ ఉపాధ్యాయులు విసిగిపోయారు. రద్దు చేస్తామన్న సిపిఎస్ సంగతిని జగన్ మర్చిపోయారు. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలను సైతం తగ్గించేశారు. ఒకటో తేదీన జీతం అన్నది మరిచిపోయేలా చేశారు. అందుకే తమను రోడ్డున పడేసిన వైసీపీ ప్రభుత్వం పై.. గత కొద్ది రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెబుతామని ఎన్నో సందర్భాల్లో హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నడూ లేని విధంగా తొలిరోజు బ్యాలెట్ ఓటు వేసేందుకు ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కడం విశేషం.సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి లక్షన్నర దరఖాస్తులు వచ్చేవి. ఎన్నికల విధుల దృష్ట్యా కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఇష్టపడేవారు కాదు. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయడం అనేది ఒక ప్రక్రియగా మారడంతో ఎక్కువమంది ఓటు వేసేవారు కాదు. ఈసారి పట్టు పట్టి మరి రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బంది పెట్టింది. వాటన్నింటిని అధిగమించి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ లను పొందగలిగారు. నిన్నటి నుంచి ఓటు వేయడం ప్రారంభించారు.ఓటు అనేది ఆత్మ ప్రబోధానుసారం వేసినా.. చాలామంది తాము వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసామని చెబుతున్నారు. దాదాపు నూటికి 90 శాతానికి పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. చాలామంది ఈ విషయాన్ని బాహటంగానే చెప్పుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో సలహాలు సూచనలతో నిండిపోయాయి. ఉద్యోగులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని.. దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పలానా పార్టీకి ఓటు వేయాలని నేరుగా చెప్పకపోయినా.. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పినా.. అది కచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా వేయాలని చెప్పడమేనని తెలుస్తోంది. అయితే ఇందులో కరుడుగట్టిన జగన్ అభిమానులు సైతం.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఉద్యోగ ఉపాధ్యాయులు జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు.

Related Posts