YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐరన్ బండ, యనగండ్ల, గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ రోడ్ షో

ఐరన్ బండ, యనగండ్ల, గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ రోడ్ షో

గోనెగండ్ల మే 06
 ఐరన్ బండ, యనగండ్ల, గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి  బుట్టా రేణుక  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి జన జాతర లా రోడ్ షో నిర్వహించారు. వారు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి  బలపరిచిన, ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆమె మాట్లాడుతూ బీసీ మహిళ అయిన నాకు మీరు నన్ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఎమ్మిగనూరు మీరందరి సహాయ సహకారాలతో  అభివృద్ధికి కృషి చేస్తానని, రోడ్లు, డ్రైనేజీలు,వాటర్ సమస్యలు జగనన్న దృష్టికి తీసుకెళ్లి శాశ్విత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే  ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు
*ఈ ప్రచారంలో ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు బి.ఆర్ బసిరెడ్డి, గోనెగండ్ల మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts