YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో భాగస్వాములు కావాలి - రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్

ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో భాగస్వాములు కావాలి - రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్

హైదరాబాద్ మే 06
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
సోమవారం హైదరాబాద్ గన్ ఫౌండ్రి లోని ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ను సందర్శించి స్ట్రాంగ్ రూమ్, డేటా ఎంట్రీ, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, రిజిస్టర్లను ఆయన పరిశీలించారు.
ఇప్పటివరకు ఎంతమంది ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చేశారని అడిగి జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ను అడిగి  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగుల కోసం వారు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మే 3 నుండి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వారిగా ఈవిఎం రాండమైజేషన్ జరిగిందని,  బ్యాలెట్ కమిషనింగ్ ప్రక్రియ మొదలు అయిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు త్రాగునీరు, షేడ్స్, మెడికల్ బృందాలు, షామియాన, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలి జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశించడం జరిగిందని ఎండ తీవ్రత ఎక్కువ ఉండే  అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటరు ఎవ్వరికీ ఇబ్బందులు తలెత్త కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు . ఆదివారం వరకు హోమ్ ఓటింగ్ 50 శాతం కంటే ఎక్కువ గా  పూర్తయిందని
తెలిపారు. ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పకుండా  ఇంటి నుండి ఓటు వేసేందుకు ముందుకు రావాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జి హెచ్ ఎం సి కమిషనర్  రోనాల్డ్ రోస్  మాట్లాడుతూ  జిల్లాలో  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గం లో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఫేసిలిటెషన్ సెంటర్లు ను ఏర్పాటు చేసినట్లు అదే విధంగా హొమ్ ఓటింగ్ పక్రియా కూడా కొనసాగుతుందని
ఇప్పటి వరకు రెండు పార్లమెంట్ నియోజక వర్గాల తో పాటుగా  కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ వినియోగిచుకుంట్లు తెలిపారు
హోమ్ హోటింగ్ లో  ఆదివారం నాటికి 571 ఓటర్ల కు గానూ 479 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న రు అని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్  వివరించారు.
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికి స్వీప్ కార్యక్రమం ద్వారా  అవగాహన కల్పించేందుకు విశేష కృషి చేస్తున్నమనిబన్నారు
ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ లో  ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు  ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఓటు ప్రజాస్వామ్యం మనుగడకి వారి వారి బాధ్యతను గుర్తు చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి అన్నారు .
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, , హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Related Posts