YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పవర్ ఛాలెంజ్.. పక్కా ప్లాన్

పవర్ ఛాలెంజ్.. పక్కా ప్లాన్

హైదరాబాద్, మే 7
ఎండలతో పగటి ఉష్ణోగ్రతలు తెలంగాణలో 46 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో పంకాలు, ఏసీలు నిరవధికంగా వినియోగిస్తున్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవడంతో తెలంగాణలో విద్యుత్ డిమాండ్, వినియోగం రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ నెల 3న అత్యధికంగా 89.71 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైంది. గతేడాది సరిగ్గా అదే రోజు 58.34 మిలియన్‌ యూనిట్ల వినియోగంతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2న 228.50 మి.యూ. వినియోగం నమోదైంది. గతేడాది మే 2 (151.71 మి.యూ.)తో పోలిస్తే ఇది మరింత అదనం. ముందు ముందు హైదరాబాద్‌లో రోజువారీ వినియోగం 90 మిలియన్‌ యూనిట్లకు పెరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు. దాదాపు వర్షాలు పడేదాకా ఇదే పరిస్థితి. మే నెలాఖరు దాకా విద్యుత్ వినియోగం ఇదే తీరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌ ముగిసే వరకు ప్రతి 11 కేవీ ఫీడర్‌కు ఇన్‌ఛార్జిగా ఒక ఇంజినీర్‌ను నియమించామని అధికారులు చెబుతున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో, సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 300 మంది ఇంజినీర్లకు ఆపరేషన్‌ విధులు కేటాయించారు. సర్కిల్‌ కార్యాలయాల్లో పనిచేసే అకౌంటింగ్‌ సిబ్బందికి సైతం విధులు అప్పగించాలని ఆదేశించారు. వేసవి డిమాండ్‌ నేపథ్యంలో అదనంగా 4,353 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మరో 250 ట్రాన్స్‌ఫార్మర్లను క్షేత్రస్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని విద్యుత్ సంస్థ ప్రధాన అధికారులు చెబుతున్నారు.తెలంగాణ‌లో ఇందిరమ్మ రాజ్యం కొలువు తీరాక‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆయా రంగాల‌కు చెందిన అధికారులు, నిపుణుల‌తో తొలి నెల రోజుల పాటు ప్ర‌త్యేకంగా స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ ఎలా ఉంటుంది? వేసవి రోజుల్లో ఏమేర‌కు పెరుగుతుంది? రాష్ట్ర విద్యుత్ ఉత్పాద‌న సామ‌ర్థ్యం, కొనుగోలు అంశాల‌పై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆ ఫ‌లితాలే ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయని అంటున్నారు అధికారులు.గ‌త ఏడాది మే తొలివారంలో రాష్ట్ర విద్యుత్ వినియోగం స‌రాసరి 150 ఉంచి 160 మిలియ‌న్ యూనిట్లుగా ఉండేది. ఇప్పుడు ఈ విద్యుత్ వినియోగం 225 నుంచి 230 మిలియ‌న్ యూనిట్లు ఉంది. రాష్ట్ర స్థాపిత విద్యుత్ విద్యుత్ ఉత్ప‌త్తి 100 మిలియ‌న్ యూనిట్లు ఉంటే.. దాదాపుగా 150 మిలియన్ యూనిట్ల‌ను కొనుగోలు చేసి ప్ర‌జ‌ల‌కు ప‌వ‌ర్ క‌ట్స్ లేకుండా విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఉప మఖ్య‌మంత్రి చ‌ర్య‌లు చేప‌ట్టారు.తాత్కాలిక అవ‌స‌రాల కోసం విద్యుత్ కొనుగోళ్లు చేప‌డుతున్నా.. భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే సొంతంగా విద్యుత్ ఉత్పాద‌క సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు త‌గు నిర్ణ‌యాల‌ను కూడా ఈ ప్ర‌భుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఆల్ట‌ర్నేటివ్ ప‌వ‌ర్ తో పాటు, గ్రీన్, సోలార్ ఎనర్జీ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఇప్ప‌టికు స్ప‌ష్టంగా చెప్పారు.

Related Posts