YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎండిపోతున్న చేపలు

ఎండిపోతున్న చేపలు

రంగారెడ్డి, మే 7,
తెలంగాణలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. నానాటికీ రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగలు ప్రారంభమవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో జనాలు బయటికి రావటానికే వణికిపోతున్నారు. మరోవైపు మాడు పగిలే ఎండలతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులోనే 19 మంది వడదెబ్బలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనుషులతో పాటు మూగజీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. తాజాగా ఎండ ధాటికి తాళలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని చెరువులో సుమారు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి.ఎండ వేడిమికి చెరువుల్లోని నీరు సలసల కాగిపోతుంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతుండటంతో చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టపడి నీటి వనరు ఏర్పాటు చేశామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా లాభం లేకపోయిందని మత్స్యకారులు బోరుమంటున్నారు.ఎంత తీవ్రత వల్ల ఒకేసారి 2 టన్నుల చేపలు చనిపోవడంతో భారీ నష్టం వచ్చిందని వాపోయారు. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో చెరువులోకి నీటిని వదులుతున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts