YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఛలో తెలంగాణ...

ఛలో తెలంగాణ...

హైదరాబాద్,  మే 7
టార్గెట్ తెలంగాణ.. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌.. మధ్యలో బీఆర్ఎస్‌.. బీఆర్ఎస్‌ను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు జాతీయ పార్టీల మెయిన్‌ టార్గెట్ తెలంగాణ. ఇక్కడ ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం కిందా మీదా పడుతున్నాయి. తెలంగాణ.. మే 13న జరిగే ఎన్నికల్లో 17 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం. పదిహేడే కదా అని సింపుల్‌గా తీసేసే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎన్నికల పరిణామాలు చూస్తుంటే.. ప్రతి సీటు ఇంపార్టెంటే.. అందుకే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. ప్రతి సీటును గెలుచుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.  ఎన్నికలకు ఇంకా 6 రోజులున్న విషయాన్ని గుర్తించి.. జోరు పెంచాయి. సభలు, సమావేశాలు, రోడ్‌ షోలతో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే చలో తెలంగాణ అని పిలుపునిస్తున్నారు జాతీయ పార్టీ నేతలు.. ఇప్పటికే రాహుల్, ప్రియాంకగాంధీ తెలంగాణలో విచ్చేశారు. బీజేపీ నుంచి ప్రధాని మోడీ, అమిత్‌ షా, జేపీ నడ్డా తెలంగాణ చుట్టే చక్కర్లు కొడుతున్నారు..మోడీ 8న వేములవాడ, వరంగల్ సభల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత 10న నారాయణపేట, హైదరాబాద్‌లో జరిగే సభలో కూడా పాల్గొంటారు. ఇప్పటికే జేపీ నడ్డా.. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్.. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. వీరంతా తెలంగాణ గడ్డపైనే ఉన్నారు.. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇలా ఏదో ఒక దాంట్లో పాల్గొన్నారు.. పాల్గొంటున్నారు కూడా.అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తెలంగాణ నేతలతో సమావేశమైన అమిత్‌ షా.. ఈ టార్గెట్ ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ప్రత్యేకమైన రూట్ మ్యాప్‌తో ముందుకు వెళుతున్నారు.అటు రిజర్వేషన్ల విజయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు అంటూ చెలరేగిపోతున్నారు. ఎట్‌ ది సేమ్‌ టైమ్.. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప మరోటి ఏం లేదని చెబుతున్నారు. మోడీ, అమిత్‌షా, నడ్డా స్పీచ్‌ల కంటే.. తెలంగాణ ప్రజలకు ఇది బాగా రీచ్ అవుతుంది.మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు కూడా తెలంగాణలో చక్కర్లు కొడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు.. ఇతర పార్టీ నేతలు కూడా తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్‌లో రాహుల్ ప్రచారం నిర్వహించగా.. ఎల్లారెడ్డిలో ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓవరాల్‌గా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ.. ప్రచారపు చివరి రోజైన 11వ తేదీ వరకు ప్రచారంలో బిజీ బిజీగా గడపనున్నారు.ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. బీఆర్ఎస్‌ది మరో బాధ అన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం సీట్ల సంగతి ఏమో కానీ.. ఓట్‌ బ్యాంక్‌ను కాపాడుకునే పనిలో బిజీగా ఉంది బీఆర్ఎస్.. ఈ ఎన్నికలు నిజానికి బీఆర్ఎస్‌ చాలా ప్రతిష్టాత్మకం.. కాంగ్రెస్, బీజేపీలకు ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్‌ బేస్‌ మొత్తం తెలంగాణానే.. ఇక్కడ ఓడిందంటే.. పార్టీ కథ కంచికే.. అందుకే గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇప్పటికే ఐదు నియోకవర్గాలను వదిలేసిన పార్టీ అధినేత కేసీఆర్.. మిగిలిన 12 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు కేటీఆర్, హరీష్‌రావు కూడా సైలెంట్‌గా ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. బట్ బీఆర్ఎస్ కేడర్‌లో కాస్త అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తుంది.2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటింగ్ పర్సంటేజ్.. 41.71 శాతం.. అదే కాంగ్రెస్‌కు 29.79 శాతం. ఇక బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 19.65 శాతం. బట్ ఈసారి ఈ లెక్కలన్నీ తారుమారు కానున్నాయి. కావొద్దన్నది బీఆర్ఎస్‌ కోరిక.. కానీ అది నెరవేరే అవకాశం కనిపించడం లేదు. అందుకే అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క.. అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలకు కౌంట్‌డౌన్ కంటిన్యూ అవుతున్న కొద్ది.. ప్రచారపర్వం ఊపందుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిందంతా పాస్ట్.. ఇకపై ఎవరు ప్రజల మనసులు గెలుచుకుంటే.. వారే కింగ్‌లు.

Related Posts