YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ

హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ

హైదరాబాద్, మే 7
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ మాత్రం కొంత మందకోడిగా సాగుతుంది. ఇక పోలింగ్ నిర్వహణ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తోంది ఎలక్షన్ కమిషన్. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామంటుంది. ఎన్నికల నిర్వహణలో మూడు లక్షల మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు దాదాపు 2,40,000 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా హోమ్ ఓటింగ్ వేయడానికి 24,000 మందికి పైగా అప్లై చేసుకుంటే 23 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. మరో వెయ్యి మందికి వివిధ కారణాలవల్ల రిజెక్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందో ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు సిఈఓ వికాస్ రాజ్. ఇందులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న విధానాన్ని పరిశీలించడానికి హైదరాబాద్ అబిడ్స్‎లో ఉన్న ఓ పాఠశాలలో ఫెసిలిటేషన్ సెంటర్స్‎ను సందర్శించి స్ట్రాంగ్ రూమ్, డేటా ఎంట్రీ, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చేశారని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగుల కోసం వారు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మే 3 నుండి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వారిగా ఈవీఎం రాండమైజేషన్ జరిగిందని, బ్యాలెట్ కమిషనింగ్ ప్రక్రియ మొదలు అయిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు త్రాగునీరు, షెడ్స్, మెడికల్ బృందాలు, షామియాన, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశించామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఎవ్వరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం వరకు హోమ్ ఓటింగ్ 50 శాతం కంటే ఎక్కువగా పూర్తయిందని తెలిపారు. ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి నుండి ఓటు వేసేందుకు ముందుకు రావాలని సూచించారు.జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఫేసిలిటెషన్ సెంటర్లును ఏర్పాటు చేశారు. అదే విధంగా హోం ఓటింగ్ పక్రియా కూడా కొనసాగుతుందని ఇప్పటి వరకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ కూడా వినియోగిచుకుంట్లు తెలిపారు. హోమ్ ఓటింగ్‎లో ఆదివారం నాటికి 571 ఓటర్లకుగానూ 479 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికి స్వీప్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించేందుకు విశేష కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్‎లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఓటు ప్రజాస్వామ్యం మనుగడకి వారి వారి బాధ్యతను గుర్తు చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి అన్నారు.

Related Posts