YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోడీ టూర్ గేమ్ ఛేంజర్ అవుతుందా

మోడీ టూర్ గేమ్ ఛేంజర్ అవుతుందా

కాకినాడ, మే 8
ఏపీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గడువు సమీపిస్తోంది. కేవలం 5 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచారాన్ని విస్తృతం చేశాయి. వైసిపి 175 అన్న నినాదంతో ముందుకెళ్తోంది. 2019 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. కూటమి తరుపున చంద్రబాబు, పవన్, పురందేశ్వరి విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైసిపి దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు.జనసేన తరఫున సినీ నటులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.తాజాగా ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది. 6, 8 తేదీల్లో నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాని పర్యటన సాగింది.రోడ్డు షో లతోపాటు భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనున్నారు. అయితే బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్న మూడు పార్లమెంట్ స్థానాల్లో ప్రధాని మోదీ పర్యటించారురాజమండ్రి నుంచి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 6న ఆ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. మరోవైపు రాజంపేట నుంచి బిజెపి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 8వ తేదీన ఆ పార్లమెంట్ సీటు పరిధిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. అదే రోజు విజయవాడలో జరిగే రోడ్ షోలో సైతం ప్రధాని పాల్గొంటారు. అక్కడ టిడిపి అభ్యర్థి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా సుజనా చౌదరి కూడా బరిలో ఉన్నారు.గత నెలలో చిలకలూరిపేట బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అటు తరువాత ఇప్పుడే ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. అయితే బిజెపి పోటీ చేస్తున్న ఆరు పార్లమెంట్ స్థానాలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా నాలుగు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరకు ఎస్టీ నియోజకవర్గం నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ,రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇందులో కనీసం నాలుగు స్థానాలు అయినా దక్కాలని బిజెపి బలమైన ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ నియోజకవర్గాల్లో బిజెపి బలం అంతంత మాత్రమే. దీంతో ఇక్కడ టిడిపి జనసేన కేడరే దిక్కు. అందుకే ప్రధాని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏపీ పర్యటనకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రధాని పర్యటనతో కూటమికి గేమ్ చేంజర్ అవుతుందని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి.
కుదట పడ్డ టీడీపీ
గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో బీజేపీతో.. టిడిపి శ్రేణులకు భారీ గ్యాప్ ఏర్పడింది. ఎన్డీఏను విభేదించి బయటకు వెళ్లిపోయారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారు. ఎప్పుడైతే చంద్రబాబు బయటకు వెళ్లారో.. నాటి నుంచి జగన్ కేంద్ర పెద్దలకు దగ్గరయ్యారు. ఎన్నికలకు ముందు.. తరువాత రాజకీయంగా లబ్ధి పొందారు కూడా. అయితే అసలు విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఎన్నికల అనంతరం బిజెపికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నించారు. చివరకు ఎన్నికల ముంగిట బిజెపితో పొత్తు కుదుర్చుకున్నారు.అయితే ఎన్నికల నిర్వహణలో బిజెపి నుంచి ఆశించిన సహకారం కోసమే చంద్రబాబు 10 అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలను త్యాగం చేశారు. అయితే బిజెపి నుంచి ఆశించిన సహకారం లేకపోవడంతో టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. గత నెలలో చిలకలూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ వైసిపి పై ఎటువంటి విమర్శలు చేయలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సహకారం అందించలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన పెరిగింది. బిజెపి వైపు అనుమానపు చూపులు కూడా ప్రారంభమయ్యాయి.40 శాతం ఓటింగ్ ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి.. ఒకటి రెండు శాతం ఓట్లు ఉన్న బిజెపికి.. ఓట్లు బదలాయింపు జరగాలంటే టిడిపికి సంతృప్తి చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది. అందుకే ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టిన వేళ.. డీజీపీ బదిలీ అయ్యారు. టిడిపి కోరిన కీలక అధికారులపై బదిలీ వేటు పడింది. ప్రధాని మోదీ తన సభల్లో వైసీపీతో పాటు జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో పాటు పవన్ పై అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వారి నాయకత్వాన్ని సమర్ధించేలా మాటలు చెప్పారు. దీంతో టీడీపీ శ్రేణులు కొంత కుదుటపడ్డాయి.ఏపీలో పాలన చేతకాని వ్యక్తి జగన్ అని ప్రధాని మోదీ ఆరోపించారు. అమరావతి, పోలవరంవంటి సమస్యలను కూడా ప్రధాని ప్రస్తావించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల స్వప్నమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని సైతం జగన్ పూర్తి చేయలేకపోయారని.. కనీసం దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. పాలన చేతకాని అసమర్థుడు జగన్ అంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారని విమర్శించారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి రుచికరమైన అంశాలే. తమకు ఇష్టమైన మాటలు ప్రధాని నోటి నుంచి వినిపించేసరికి వారు పూర్తిగా సంతృప్తి చెందుతున్నారు. వైసీపీతో బిజెపికి ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేవని నమ్ముతున్నారు

Related Posts