YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసులు ఎదుర్కోంటాం

కేసులు ఎదుర్కోంటాం

హైదరాబాద్
బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యుదు  క్రిశాంక్ ను పరామర్శించేందుకు చంచల్ టూడ జైలుకు మాజీమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు.కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్  శ్రేణులపై తప్పుడు కేసులు బాణాయించి జైలుకు పంపడం మంచిది కాదని అన్నారు.  అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా మేము బదులు చెబుతామని, క్రీషాంక్ సోషల్ మీడియా లో పోస్టు చేసిన సర్క్యులర్ తప్పుడు అయితే నేను చంచల్ గూడా జైలు కు వెళ్ళడానికి తను సిద్ధం అని, ఒకవేళ సర్క్యులర్ నిజమని మేము రుజువు చేపిస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తాడా అని కేటీఆర్ సవాల్ చేసారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమి కాదని, దైర్యంగా  ఎదుర్కోంటామని, బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ అని ఆయన అన్నారు.

Related Posts