YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు వేయం ని ఫ్లెక్సీ లు కట్టిన గ్రామ ప్రజలు

సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు వేయం ని ఫ్లెక్సీ లు కట్టిన గ్రామ ప్రజలు

భద్రాద్రి
చుంచుపల్లి మండలం గరిమెల్లపాడు గ్రామ ఆదివాసీ నగర్ లో తమ సమస్యలను పరిష్కరించే వరకు ఓట్లను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో మొత్తం 65 కుటుంబాలకు చెందిన 195 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఇల్లు, ఉపాధి హామీ, రోడ్లు, డ్రైనేజి లు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఊరి ఎంట్రన్స్ లో ఆదివాసులమైన మమ్మల్ని ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు మోసం చేస్తున్నారని, అందుకే దేవుడి తోడు మేము ఈసారి ఖచ్చితంగా ఓటు వేయం అని నినాదంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో హుటాహుటిన కొత్తగూడెం ఆర్డీవో, డిఎస్పీ, యమ్మర్వో, ఎంపిడిఓ తదితర ప్రభుత్వ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యను జిల్లా కలెక్టర్ కు, ఐటీడీవో పి ఓ దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. దీనితో గ్రామస్తులు గతంలో ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చి కనీసం పట్టించుకోలేదని పోలీసులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో అధికారులు కొద్దిసేపు ఓటు గురించి అవగాహన కల్పించారు. ఓటు వేయడం కనీస బాధ్యత అని, ఓటు వేయకుండా సామూహిక బహిష్కరణ నేరం అని గ్రామస్థులకు తెలిపారు. ఏది చెప్పినా తమకు స్పష్టమైన హామీ కావాలని గ్రామస్థులు పట్టుబట్టారు. కావాలని ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, అటువంటి వారిపై ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లెక్సీలను తొలగించి ఓట్లు వేయకుండా ప్రజలను అడ్డుకోవద్దని తెలిపారు.

Related Posts