YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి టాలీవుడ్ రెడ్ ఫ్లాగ్

 వైసీపీకి టాలీవుడ్ రెడ్ ఫ్లాగ్

విజయవాడ, మే 10
వైసిపి పై తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగుబాటు ప్రారంభమైందా? ఎన్నికల్లో ప్రభావం చూపుతోందా? ఒక్కొక్కరు పవన్ కు మద్దతు తెలపడానికి అదే కారణమా? ఈ రెండు రోజుల్లో మరింత మంది ముందుకు వస్తారా? బాహటంగా మద్దతు ప్రకటిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పిఠాపురంలో పవన్ ను గెలిపించాలని చిరంజీవి ప్రత్యేక వీడియో ప్రకటించిన తర్వాత.. యువ హీరోలంతా పవన్ కు మద్దతు ప్రకటించారు. నాని, తేజ సజ్జా, రాజ్ తరుణ్ , సంపూర్ణేష్ బాబు ఇలా ఒక్కొక్కరు ప్రత్యేక ప్రకటనలు విడుదల చేశారు. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఏకంగా వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. వైసీపీ శ్రేణులను ఉగ్రవాదులుగా పేర్కొన్నారు.అయితే చిత్ర పరిశ్రమ విషయంలో వైసీపీ సర్కార్ ఎన్ని రకాలు ఇబ్బందులు పెట్టాలో అంతలా పెట్టింది. ముఖ్యంగా టిక్కెట్ల ధర పెంపు విషయంలో అడ్డగోలుగా వ్యవహరించింది. వైసీపీ మంత్రులు అయితే స్థాయికి మించి స్పందించారు. మెగాస్టార్ లాంటి వ్యక్తులను సైతం అవమానపరిచారు. కొందరు సినీ పరిశ్రమ వ్యక్తులతో కలిసి చిరంజీవి జగన్ ను ఆశ్రయించారు. ఆ సమయంలో దొడ్డి దారిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి జగన్ ను బతిమిలాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సగటు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఆ వీడియోను చూసి చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచే వైసీపీ సర్కార్ పై వ్యతిరేక భావన అలవర్చుకున్నారుగత ఎన్నికల్లో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు వైసీపీకి మద్దతు ప్రకటించారు. టిడిపి సానుభూతిపరులైన చిత్ర పరిశ్రమ ప్రముఖులు సైతం సైలెంట్ అయ్యారు. దానికి కారణం తెలంగాణలో కెసిఆర్ సర్కార్ అప్పట్లో అధికారంలో ఉండడమే. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మిగిలిన కేసీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు వైసీపీకి అండగా నిలిచారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రేవంత్ అధికారంలో ఉండడంతో.. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. ఏపీలో తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే నలుగురు కుర్ర హీరోలు పవన్ కళ్యాణ్ కు బాహటంగానే మద్దతు ప్రకటించగలిగారు.తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మనసులో ఉన్న బాధను, అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడు. ఆయనతో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. అటు వ్యక్తిగతంగా కూడా పవన్ అంటే త్రివిక్రమ్ అభిమానిస్తారు. ఒకానొక దశలో ఆరాధిస్తానని చెప్పుకొచ్చారు. అటు పవన్ కళ్యాణ్ సైతం చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు అత్యంత ఆప్తుడని చెప్పుకొచ్చారు. అయితే పవన్ పై అభిమానంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ జనసేన కోసం ఒక పాట రాశారు. అప్పటి నుంచి వైసీపీ టార్గెట్ చేసుకుంది. సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పేరు, పర్సనల్ ఫోన్ నెంబర్ పెట్టడంతో.. ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 5000 కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా ఫోన్ చేస్తున్నవారు తిట్ల దండకాన్ని, శాపనార్ధాలు పెట్టినట్లు త్రివిక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వైసీపీని ఓడించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మొత్తానికైతే తెలుగు చిత్ర పరిశ్రమను వైసిపి చేజేతులా ప్రత్యర్థిగా మార్చుకుంటుంది. పోలింగ్ కు ముందు సినీ పరిశ్రమ పెద్దలు మరింత మంది ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది.
తాజాగా స్టైలిష్ స్టార్
తాజాగా మెగా కాంపౌండ్ లో ఉండే స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మామయ్యకు మద్దతుగా నిలిచారు. ప్రచారం చేయకపోయినా ఆయన తన మద్దతు పవన్ కల్యాణ్ కే అంటూ ఆయన ప్రకటించారు. స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కు మద్దతు ప్రకటించడంతో ఫ్యాన్స్ మరింతగా పవన్ కల్యాణ్ కు వెంట నడుస్తారని చెబుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ "మా ప్రేమ అభిమానం ఎప్పుడు మీతోనే ఉంటాయని అన్నారు. హీరో నాని కూడా పవన్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక పవన్ తో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన సంపూర్ణేష్ బాబు .. ‘ఎన్ని అడ్డంకులు వచ్చినా .. ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సదా మీ ప్రేమకి బానిస. మీ సంపూర్ణేష్ బాబు’ అని రాసుకొచ్చారు.

Related Posts