విజయవాడ, మే 16
ఏపీ శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేశారు. గతంలో వైసీపీ( తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి.. ఇటీవలే ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరారు. దీంతో ఈ విషయంపై వైసీపీ విఫ్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. ఫిరాయింపుల చట్టం కింద జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.