ఖమ్మం
స్ట్రాంగ్ రూం ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. రిటర్నింగ్ అధికారి, ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూం లను సందర్శించి, భద్రతను పరిశీలించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూం లను పరిశీలించి, విధుల్లో ఉన్న సాయుధ బలగాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూం ల వద్ద ఏర్పాటుచేసిన లైట్లు 24 గంటలు ఆన్ లో ఉంచాలన్నారు. స్ట్రాంగ్ రూం సిసి కెమెరాల వ్యూ కోసం ఏర్పాటుచేసిన ఎల్ఇడి తెరలను పరిశీలించి, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్ట్రాంగ్ రూం ల పరిశీలనకు ఎంట్రీ పాస్ ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లకు అనుమతించాలని ఆయన తెలిపారు. కౌంటింగ్ రూం ల ఏర్పాటు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అప్రమత్తంగా వుంటూ, భద్రతా చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారి అన్నారు.